COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Rasi Phalalu 2024: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. కొన్ని గ్రహాలు కలవడం కారణంగా మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. అయితే రాబోయే 2024 సంవత్సరంలోని ఫిబ్రవరి 15న శుక్ర, రాహు గ్రహాలు కలవబోతున్నాయి. శుక్ర గ్రహం మీన రాశిలోకి సంచారం చేసిన వెంటనే రాహు గ్రహం కూడా సంచారం చేయబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెండు గ్రహాలను స్నేహపూర్వక గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ గ్రహాల కలయిక కారణంగా శుభ ప్రభావం ఏర్పడబోతోంది. దీంతోపాటు కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తోంది. అయితే ఈ శుభ ప్రభావం ఏయే రాశుల వారిపై పడబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఈ రాశుల వారికి రాబోయే కొత్త సంవత్సరంలో లాభాలే లాభాలు..
వృషభ రాశి:

వృషభ రాశి వారు రాబోయే కొత్త సంవత్సరంలో వ్యాపార విస్తరణ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో మీ సోదరుల మద్దతు లభించి పనులన్నీ విజయవంతంగా ముగిస్తారు. అంతేకాకుండా కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి. దీనికి కారణంగా బట్టలతోపాటు ఇతర ఖరీదైన బహుమతులు కూడా పొందుతారు. ఉద్యోగాలు చేస్తున్న వారు తొందరలోనే స్థానచలనం చేసే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో వాహన సౌకర్యం పెరిగి ప్రయాణాలు కూడా చేయవచ్చు. ఇక ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్నవారు ఊహించని లాభాలు పొందుతారు. 


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 


మిథున రాశి:
రాబోయే కొత్త సంవత్సరంలో మిథున రాశి వారు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ప్రేమతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామి నుంచి కూడా అన్ని పనులకు మద్దతు లభించి విజయాలు సాధిస్తారు. ఒక ఉద్యోగాలు చేస్తున్న వారు ఆఫీసులో మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో ఆర్థిక వనరులు పెరిగి ఊహించని డబ్బులు పొందుతారు.


కన్యారాశి:
కన్యా రాశి వారు కూడా వచ్చే కొత్త సంవత్సరంలో ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. ఈ సమయంలో ఇల్లు లేదా వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితం గడుపుతున్న వారు ఎంతో ఆనందంతో ఉంటారు.  అంతేకాకుండా మీ సమయం ఉద్యోగం చేసే వారికి వరం లాంటిది. కాబట్టి కష్టపడి పనిచేయడం వల్ల ప్రమోషన్స్ పొందే అవకాశాలున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్తారు.


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి


ధనుస్సు  రాశి:
ధనస్సు రాశి వారికి ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా అనేక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభించి ఎలాంటి పనుల్లోనైనా సులభంగా విజయాలు సాధిస్తారు. అలాగే కుటుంబం మొత్తంతో కలిసి దేవాలయాలు దర్శించుకుని, విహారయాత్రలకు కూడా వెళ్తారు. ఇక ఉద్యోగాలు చేసే వారి విషయానికొస్తే.. ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.