January 26 Horoscope: జనవరి 26 2022 నాటి రాశిఫలాలు ఈ విధంగా ఉన్నాయి... కొన్ని పరిస్థితుల వల్ల ఆ రాశి వారు నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. మరొక రాశి వారు ఈ రోజు మీరు ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. ఇక ఆయా రాశుల.. రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం: (Aries)
మనోధైర్యంతో ముందుకెళ్లండి విజయం మీ చెంతనే ఉంటుంది. కాస్త అలసట పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని పరిస్థితుల వల్ల మీరు నిరుత్సాహానికి గురవుతారు. అలాగే కొన్ని వ్యవహారాల్లో మీరు చాలా వివేకంగా వ్యవహరిస్తారు. విష్ణు దేవుడి నామస్మరణ చేస్తే మేలు.


వృషభం: (Taurus)
మీరు ఈ రోజు ఆశించిన ఫలితాలు పొందుతారు. ఇవాళ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు మీరు ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. ఇక ఇవాళ మీరు శని శ్లోకం పఠిస్తే చాలా మంచిది. 


మిథునం: (Gemini)
మీరు ప్రారంభించిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయి. అయినా కూడా మీరు అన్ని పనులను పట్టుదలతో అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడంతో ఇంటిలో కూడా మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. శివుడిని ఆరాధించడం చాలా మంచిది.


కర్కాటకం: (Cancer)
మీకు ఇవాళ కాస్త శారీరక శ్రమ పెరుగనుంది. మీరు చేయని పొరపాట్లకు కూడా నిందలు పడాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మనోధైర్యం కోల్పోవొద్దు. బంధువులతో ఎట్టి పరిస్థితుల్లో వాదనలకు దిగకండి. మీరు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేస్తే మంచిది.


సింహం : (Leo)
ఈ రోజు మీరు ఆశించిన ఫలితాల్ని పొందుతారు. ఇవాళ మీ బంధువులతో జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో ఆచితూచి ప్రవర్తించండి. మీ మనోబలం తగ్గకుండా చూసుకోవడం మంచిది. ఇక కొన్ని ముఖ్యమైన పనుల్లో మీకు పురోగతి లభిస్తుంది. ఇష్టదైవాన్ని పూజించండి.


కన్య: (Virgo)
మీరు మంచి భవిష్యత్తు కోసం ప్రణాళిక రూపొందించుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. ఇక ఒక సంఘటనలో మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజిస్తే మంచిది.


తుల: (Libra) 
ఇవాళ ఈ రాశి వారు ఉద్యోగంలో అలాగే వ్యాపారాల్లో వారి అంచనాల్ని అందుకుంటారు. విందూ, వినోదాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ మీరు పాల్గొంటారు. ఈ రోజు ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని తీసుకొస్తుంది. ఇష్టదైవానికి పూజ చేయండి.


వృశ్చికం : (Scorpio)
ఈ రాశి వారికి ఈ రోజు వారి శ్రమకు తగ్గట్లుగా ఫలితం లభించనుంది. మీరు మీ బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అయితే ఒక విషయంలో మాత్రం మీరు ధైర్యంగా ముందడుగు వేయడంతో మంచి పేరు వస్తుంది. కుటుంబ విషయాల్లో మీకు చాలా ఓర్పు కావాల్సి ఉంటుంది. శ్రీవిష్ణువును పూజించడం మంచిది.


ధనుస్సు: (Sagittarius) 
కుటుంబంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉండనుంది. అయితే కొన్ని సంఘటనల వల్ల మీలో ఉత్సాహం పెరుగుతుంది. మీరు బంధువులతో ఆచి తూచి వ్యవహరిస్తే మంచిది. అలాగే మీరు పంచముఖ ఆంజనేయున్ని ఆరాధిస్తే మంచి ఫలితాలు పొందుతారు.


మకరం: (Capricorn) 
ఈ రోజు మీరు అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మీరు ప్రారంభించిన పనులన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి అవుతాయి. మీరు కొన్ని కీలక బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది... ఆ బాధ్యతలను మీరు సమర్థంగా నిర్వహించగలరు. శివుడిని పూజిస్తే మంచిది.


కుంభం: (Aquarius) 
మీరు చేపట్టబోయే పనుల్లో ఆటంకాలు వస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దల్ని కలుస్తారు. కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా రాకపోవచ్చు అయినా ధైర్యంగా ముందుకెళ్లండి. ఈ రోజు మీరు దత్తాత్రేయుడి స్తోత్రం చదివితే మంచిది.


Also Read : Buddhadeb Bhattacharjee: 'పద్మభూషణ్ అవార్డు నాకొద్దు'... తిరస్కరించిన బుద్ధదేవ్!


మీనం: (Pisces) 
మీ శ్రమకు తగ్గట్లుగా ఫలితం ఉండనుంది. మీరు పెద్దల నుంచి ప్రోత్సాహకాల్ని అందుకోనున్నారు. మీకు అలసట కాస్త ఎక్కువే ఉంటుంది. ఇక మీ తోటివారి సహకారం వల్ల మీ పనులన్నీ చాలా త్వరగా పూర్తికానున్నాయి. వెంకటేశ్వరస్వామిని ఆరాధించడం వల్ల కలగనుంది.


Also Read : Republic Day 2022 : రిపబ్లిక్‌ డేకు సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌ ఇదిగో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.