Buddhadeb Bhattacharjee: పద్మభూషణ్‌ పురస్కారంను తిరస్కరించిన బుద్ధదేవ్‌ భట్టాచార్య!

Padma awards: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య పద్మభూషణ్‌ పురస్కారాన్ని తిరస్కరిస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2022, 07:05 AM IST
  • పద్మపురస్కారాల ప్రకటన
  • మెుత్తం 128 మంది అవార్డులకు ఎంపిక
  • పద్మభూషణ్‌ ను తిరస్కరించిన సీపీఎం నేత బుద్ధదేవ్
Buddhadeb Bhattacharjee: పద్మభూషణ్‌ పురస్కారంను తిరస్కరించిన బుద్ధదేవ్‌ భట్టాచార్య!

Padma awards: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య (Buddhadeb Bhattacharjee) మంగళవారం పద్మభూషణ్ (Padma Bhushan award) అవార్డును తిరస్కరించారు. ''ఈ అవార్డు గురించి నాకు ఏమీ తెలియదు. దాని గురించి ఎవరూ నాకు ఏమీ చెప్పలేదు. వారు నాకు పద్మభూషణ్ ఇవ్వాలని నిర్ణయించుకుంటే, నేను దానిని అంగీకరించడానికి నిరాకరిస్తున్నాను'' అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. బుద్ధదేవ్‌తో పాటు పార్టీ నిర్ణయం కూడా ఇదేనని సీపీఎం వర్గాల సమాచారం.

గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి దేశ అత్యున్నత పౌరపురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. ఇటీవల హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన మాజీ సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ (Bipin Rawat), యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ సహా నలుగురికి పద్మవిభూషణ్ అవార్డు లభించగా, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్జీ,  సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌, సైరస్‌ పూనావాలాలతో సహా 17 మందిని పద్మభూషణ్‌తో సత్కరించారు. 107 మందిని పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. మొత్తం 128 పద్మ పురస్కారాల్లో తెలంగాణకు 4, ఆంధ్రప్రదేశ్‌కు 3 సొంతం చేసుకున్నాయి. 

Also Read: Padma awards 2022: పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం.. బిపిన్ రావత్, కృష్ణ ఎల్లా, నీరజ్ చోప్రా ఎంపిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News