RasiPhalalu today Horoscope December 22, 2021: what is special for those zodiac signs check here : రాశిఫలాలు డిసెంబర్ 22, 2021: 
విక్రం సంవత్సరం - ఆనంద 2078, మార్గశిరము 18
పుర్నిమంతా - 2078, పుష్యము 3
అమాంత - 2078, మార్గశిరము 18
తిథి
బహుళపక్షం తదియ - Dec 21 02:54 PM – Dec 22 04:52 PM
బహుళపక్షం చవితి  - Dec 22 04:52 PM – Dec 23 06:27 PM
నక్షత్రం
పుష్యమి - Dec 21 10:25 PM – Dec 23 12:45 AM
ఆశ్లేష - Dec 23 12:45 AM – Dec 24 02:41 AM


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య, చంద్ర సమయం
సూర్యోదయము - 6:46 AM
సూర్యాస్తమానము - 5:43 PM
చంద్రోదయం - Dec 22 8:30 PM
చంద్రాస్తమయం - Dec 23 9:53 AM


అనుకూలమైన సమయం
రాహు - 12:14 PM – 1:36 PM
యమగండం - 8:08 AM – 9:30 AM
గుళికా - 10:52 AM – 12:14 PM
దుర్ముహూర్తం - 11:52 AM – 12:36 PM
వర్జ్యం - 02:35 PM – 04:19 PM


శుభ సమయం
అమృతకాలము - 05:44 PM – 07:29 PM
బ్రహ్మ ముహూర్తం - 05:10 AM – 05:58 AM. ఇక డిసెంబర్ 22, 2021 రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి.


మేషం: (Aries) ఈ రోజు మీకు అంతా మంచే జరుగుతుంది. మీ ఆలోచన విధానం వల్ల తెలివితేట వల్ల పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ వ్యాపార పురోగతి కోసం కుటుంబ సభ్యులతో చర్చించాల్సి వస్తుంది. సాఫ్ట్‌వేర్ కంపెనీలలో పని చేసే వారికి ఈ రోజు చాలా మంచిది. కుటుంబంలో మీకు అంతా అనుకూలమైన వాతావరణమే ఉంటుంది.


వృషభం: (Taurus) ఈరోజు కొన్ని కొత్త విధానాలను మీరు పాటించాల్సి వస్తుంది. అలా చేయడం వల్ల మీకు అంతా మంచే జరుగుతంది. పాత పెట్టుబడుల నుంచే వచ్చే డబ్బుతో మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. రోజంతా మీరు సరదాగా గడుపుతారు. మీ ఇష్ట దైవాన్ని తలుచుకుని పనులు ప్రారంభించండి. 


మిథునం : (Gemini) ఈరోజు ఉదయం పరస్థితులు కాస్త మీకు అనుకూలంగా ఉండవు. ఆలోచించి అడుగు వేయండి. ఉద్యోగ రంగంలో మీ కృషికి తగ్గట్లుగా గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హోల్‌సేల్ వ్యాపారులు పెద్ద మొత్తంలో వస్తువులను కొనుగోలు చేయకూడదు.


కర్కాటకం: (Cancer) ఈరోజు మీ అభిప్రాయాలను బయటకు చెప్పకండి. రచయితలు అయితే కొన్ని శుభవార్తలు వింటారు. మీ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. వేస్ట్ చేయకండి. చెడు సాంగత్యానికి దూరంగా ఉండండి. యువత వారి తల్లిదండ్రుల సూచనలను పాటించాలి.


సింహం : (Leo) ఈరోజు మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది. మంచి ఆదాయం వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఒక అత్యవసర పని వల్ల మీరు ముందుగా ప్రణాళిక చేసుకున్న పనుల్లో మార్పు చేయాల్సి వస్తుంది. 


కన్య: (Virgo) మీరు మీ కుటుంబ సభ్యుల అంచనాలను అందుకుంటారు. బహుమతులు పొందుతారు. చాలా మంది నుంచి గౌరవం దక్కుతుంది. పని చేసే ప్రాంతంలో.. మీరు మీ లక్ష్యంపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వృథా ఖర్చులను తగ్గించాలి. 


తుల: (Libra) వ్యాపారంలో గతంలో నిలిచిపోయిన పనులను పరిష్కరించుకోవడానికి ఈరోజు అనువైన సమయం. మీరు కొంతమంది కొత్త వ్యక్తులను కలుస్తారు. దీంతో మీకు ప్రయోజనం చేకూరుతుంది. స్థిరాస్తి కొనుగోలుకు ప్రణాళిక రూపొందించుకునే అవకాశం ఉంటుంది. మీ వైవాహిక జీవితం ఎంతో బాగుంటుంది.


వృశ్చికం: (Scorpio) ఈ రోజు మీ జీవితంలో కొత్త మార్పులు రావొచ్చు. వాటికి సిద్ధంగా ఉండండి. పనిలో పరిపక్వత చూపాలి. ధైర్యంగా ఉండండి. మీకు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. వృత్తి సంబంధమైన సమస్యలను అధిగమిస్తారు.


ధనుస్సు : (Sagittarius) ఈ రోజు అంతా సంతోషకరంగా ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాల గురించి ఆలోచిస్తారు. ఏదైనా విలువైన వస్తువుల కొనుగోలు చేయాలంటే ఇది అనుకూల సమయం. మీపై అధికారులు మీకు పెద్ద బాధ్యతలను అప్పగిస్తారు.


Also Read : Vastu Tips For Home: ఈ మూడు వస్తువులు ఇంటికి ఉత్తరం వైపు ఉంటే లక్ష్మీ కటాక్షం తథ్యం!


మకరం: (Capricorn) ఈ రోజు మీ ప్రతిభను, సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం మీకు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వ్యక్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే.. వాటి నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది.


కుంభం: (Aquarius) ఈరోజు మీ ఆలోచనల్లో కాస్త మార్పు కనిపిస్తుంది. వ్యాపార ప్రణాళికలను రూపొందిస్తారు. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందుతారు. దాంపత్య జీవితం బాగుంటుంది. మీ భాగస్వామి నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది.


మీనం: (Pisces) ఈ రోజు మీరు ఏదైనా ప్రసంగం ఇస్తుంటే దాని వల్ల మీకు చాలా ప్రయోజనం చేకూరుతుంది. వస్త్ర వ్యాపారులకు కాస్త నిరాశ ఎదురవుతుంది. త్వరగా లాభం పొందాలనే తపనతో తప్పుడు పద్ధతులను ఎంచుకోకండి. మీ కుటుంబ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.


Also Read : Vastu tips: ఆఫీస్ టేబుల్‌ను ఇలా సెట్ చేసుకుంటే ఇక విజయం మీ సొంతం...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook