Ravi Yoga Good Effect: అరుదైన రవి యోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి ఇంట్లో ఎటు చూసినా డబ్బే డబ్బు!
Ravi Yoga Good Effect: రవి యోగం ఏర్పడడం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరికి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకోండి.
Ravi Yoga Good Effect: అక్టోబర్ 6న చంద్రుడు తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. అలాగే ఈరోజు నవరాత్రుల్లో భాగంగా దుర్గాదేవి కూష్మాండ అవతారంలో భక్తులందరికీ దర్శనం ఇవ్వబోతోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజున జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో శక్తివంతమైన రవి యోగం ఏర్పడబోతోంది ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు అద్భుతమైన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ నవరాత్రుల్లో భాగంగా కొన్ని రాశుల్లో జన్మించిన వ్యక్తులకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా రవియోగం ఎఫెక్ట్తో ఊహించని ధన లాభాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి నవరాత్రుల్లో నాలుగో రోజు ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా ఈరోజు నుంచి వీరికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వీరు బోలెడు డబ్బులు సంపాదిస్తారు. సెలవు దినాల్లో విహారయాత్రలకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చుట్టూ ఉన్న స్నేహితులతో బంధం మరింత మెరుగు పడుతుంది.
ఇక భాగస్వామ్య వ్యాపారాలు చేసే వృషభ రాశి వారికి ఈ రోజు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వైవాహిక జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ పిల్లలతో కూడా మంచి సమయాన్ని గడిపే అదృష్టాన్ని పొందుతారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కూడా ఈ సమయం ఎంతో అదృష్టాన్ని తెచ్చి పెట్టబోతోంది. ముఖ్యంగా వీరు ఈ సమయంలో ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా అద్భుతమైన ప్రయోజనాలను పొందేందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
వ్యాపారాలు చేసే కర్కాటక రాశి వారికి ఈరోజు అనేక లాభాలు కలుగుతాయి. గతంలో కుటుంబ సభ్యులతో గొడవలు ఆయన వారికి ఈ సమయంలో సులభంగా పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ సమయం కాస్త ఉపశమనం కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.