Maha Shivratri 2022: మహాశివరాత్రి పవిత్ర పండుగ ఫాల్గుణ కృష్ణ చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది ఇది మంగళవారం, మార్చి 1 న జరుపుకుంటారు. మహాశివరాత్రి రోజున శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడని నమ్ముతారు. ఈ రోజున భోలేనాథ్ భక్తులు భక్తితో మరియు విశ్వాసంతో ఉపవాసం ఉండి..శివుడిని పూజిస్తారు. మహాశివరాత్రి (Maha Shivratri 2022) రోజున  శివారాధన చేస్తే భక్తులు కోరికలు నెరవేరుతాయట. మీరు కోరుకున్న ఉద్యోగం సాధించాలంటే...శివరాత్రి రోజున పూజలు చేయాలి. కోరుకున్న ఉద్యోగం కోసం మహాశివరాత్రి నాడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉద్యోగ, వ్యాపారంలో విజయం సాధించడానికి..
మహాశివరాత్రి రోజున శివునికి వెండి కుండ లేదా కుండతో అభిషేకం చేయండి. శివలింగంపై అభిషేకం చేస్తున్నప్పుడు.. 'ఓం నమః శివాయ' అని జపిస్తూ ఉండండి. శివారాధనలో తెల్లటి పూలను ఉపయోగించండి. ఇలా చేసిన తర్వాత.. శివుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ, వ్యాపారం లేదా ఉద్యోగంలో విజయం కోసం ప్రార్థించండి.


డబ్బు పొందడానికి..
మహాశివరాత్రి రోజున.. ఉదయం స్నానం చేసి, మంచి బట్టలు ధరించి, పంచామృతంతో శివునికి అభిషేకం చేయండి. శివలింగంపై పంచామృత పదార్థాలను ఒక్కొక్కటిగా అందించండి. చివరగా, శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. శివునికి నీటిని సమర్పించిన తర్వాత 'ఓం నమః పార్వతీపతయే' అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేసిన తరువాత.. సంపదలు. ఆదాయం పెరగాలని శివుడిని ప్రార్థించండి.


మంచి ఆరోగ్యం కోసం..
మహాశివరాత్రి రోజున ఉదయం చేసే పూజతో పాటు సాయంత్రం మట్టి దీపంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని నింపి, కొద్దిగా కర్పూరం వేసి పూజించాలి. ఇది కాకుండా.. పాలు, పంచదార మిఠాయి, అక్షతలను నీటిలో కలిపి శివలింగంపై సమర్పించండి. ఇలా చేస్తున్నప్పుడు 'ఓం నమః శివాయ' అని 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి.


వివాహం కోసం..
వివాహానికి ఎలాంటి ఆటంకాలు ఎదురైనా లేదా మీకు ఉత్తమ జీవిత భాగస్వామిని కోరుకుంటే.. మహాశివరాత్రి శుభ సందర్భంగా సాయంత్రం పసుపు బట్టలు ధరించి శివాలయానికి వెళ్లండి. దీని తర్వాత, మీ వయస్సుకు సమానంగా బిల్వ పత్రాలు తీసుకోండి. అన్ని బిల్వ పత్రాలపై పసుపు చందనం పూసి శివునికి సమర్పించండి. ప్రతి బిల్వ  పత్రాన్ని సమర్పించేటప్పుడు 'ఓం నమః శివాయ' అని జపిస్తూ ఉండండి. ఇలా చేసిన తర్వాత శివునికి ధూపం వేసి పూజించి తొందరగా వివాహం జరగాలని ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల కోరికలు నెరవేరిన అనుగ్రహం లభిస్తుంది.


Also read: Mahashivratri 2022: మహాశివరాత్రి నాడు ఈ పూజలు చేస్తే మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook