Mahashivratri 2022: హిందూ సంప్రదాయం ప్రకారం.. మహాశివరాత్రి పర్వదినం నాడు పరమ శివుడు, పార్వతి దేవీ వివాహం జరిగిన రోజుగా పరిగణిస్తారు. మహాశివరాత్రిని ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈ రోజున పరమేశ్వరునికి 24 గంటల పాటు పూజలు, అభిషేకాలు జరుగుతుంటాయి. మహాశివరాత్రి రోజు ఉపవాసం, రుద్రాక్ష పూజ, జాగరణ చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఇలా చేయడం వల్ల.. చంద్రుడు తమ తమ జాతకాల్లో ఒక శక్తివంతమైన శక్తిగా మారడం వల్ల జీవితంలోని అన్ని సమస్యలను తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
మహాశివరాత్రి రోజు పూజా ప్రయోజనాలు
పరమేశ్వరుని అనుగ్రహం పొందేందుకు మహాశివరాత్రి చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున కొన్ని ప్రత్యేక పూజలు, నియమాలు పాటించడం వల్ల జీవితంలోని సమస్యలు తొలిగి మనసులోని కోరికలు నెరవేరుతాయని తెలుస్తోంది.
ఆరోగ్యంగా ఉండేందుకు..
అనేక రోగాల నుంచి విముక్తి పొందేందుకు మహాశివరాత్రి రోజు ఆలయంలో మట్టి కుందీలో నెయ్యిని నింపి.. అందులో కొంచం కర్పూరం వేసి దీపం వెలిగించండి. ఆ తర్వాత చక్కరతో కలిపిన బియ్యం పాలను శివునికి సమర్పించాలి. అలాగే, ఓం నమః శివాయ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. అలా చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.
వృత్తిపరిమైన విజయాలు
మహాశివరాత్రి నాడు శివుని వెండి పాత్రలతో అభిషేకం చేయడం ద్వారా మంచి జరుగుతుంది. దీంతో పాటు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల వ్యాపారంతో పాటు వృత్తిపరమైన ఉద్యోగాల్లో అనుకున్న విజయాలను సాధిస్తారు.
సంతానం కోసం
మహాశివరాత్రి నాడు భార్యాభర్తలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే.. సంతానం కలిగే అవకాశం ఉంది. శివలింగాన్ని నెయ్యితో పాటు శుద్ధమైన జలంతో అభిషేకం చేయించి, సంతానం కోసం దేవుణ్ణి ప్రార్థించాలి. దీంతో పాటు శివునికి ఇష్టమైన బిళ్వ పత్రాలతో పూజించడం వల్ల శివుని అనుగ్రహం వెంటనే పొందవచ్చు.
సంపద కోసం..
మహాశివరాత్రి నాడు సూర్యోదయం తర్వాత పంచామృతాలతో (పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి) శివునికి అభిషేకం చేయాలి. ఆ పంచామృతాలను ఒక్కొక్కటిగా సమర్పించి.. చివరిగా నీటితో శివలింగానికి అభిషేకం చేయాలి. ఆ తర్వాత ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఇంట్లో ధనప్రాప్తి ఉంటుంది.
Also Read: Horoscope Today Feb 24 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారు తమ సోల్ మేట్‌ని కలిసే ఛాన్స్..!
Also Read: Phalguna Purnima 2022: ఫాల్గుణ పంచమి నాడు ఈ పూజ చేస్తే ఏడాది పాటు డబ్బే డబ్బు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook