Mangal Vakri 2022: వేద జ్యోతిషశాస్త్రంలో కుజుడును గ్రహాల అధిపతిగా భావిస్తారు. ప్రతి వ్యక్తి జాతకంలో మూడవ, ఆరవ మరియు పదో ఇంటికి కారకుడిగా అంగారకుడిని భావిస్తారు. అంతేకాకుండా కుజుడు లగ్నానికి మరియు ఎనిమిదో ఇంటికి అధిపతిగా పరిగణిస్తారు. ధైర్యం, బలం, శక్తికి కారకుడు అంగారకుడు. నవంబరు 13న తిరోగమన కుజుడు వృషభరాశిలోకి (Mangal Vakri 2022) ప్రవేశించనున్నాడు. కుజుడి ఈ సంచారం వల్ల నాలుగు రాశులవారికి కష్టాలు పెరుగుతాయి. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులారాశి (Libra)- తుల రాశి యెుక్క సప్తమ మరియు రెండవ ఇంటికి కుజుడు అధిపతి. ఈ రాశి యెుక్క 8వ ఇంట్లో అంగారకుడు సంచరించనున్నాడు. తులరాశి యెుక్క 11వ, 2వ మరియు 3వ ఇంట్లో కుజుడు ఉండబోతున్నాడు. ఈ సమయంలో మీరు కొంత ఆకస్మిక ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఎవరినీ నమ్మకండి. 


మకరం (Capricorn)- మకర రాశి వారికి నాల్గవ మరియు పదకొండవ గృహాలకు అంగారకుడిని అధిపతిగా భావిస్తారు. మీ ఐదవ ఇంట్లో కుజుడు సంచరిస్తాడు. అంతేకాకుండా మీ రాశిచక్రంలోని ఎనిమిదవ, పదకొండవ మరియు పన్నెండవ ఇంట్లో అంగారకుడి సంచరించనున్నాడు. ఈ సమయంలో మీరు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. పిల్లల వైపు నుండి ఇబ్బందులు ఎదుర్కోంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 


మేషరాశి (Aries)- మేష రాశి యెుక్క లగ్నంతో పాటుగా అష్టాధిపతి అంగారకుడు. కుజుడు ఈ రాశి యొక్క రెండో ఇంటిలో కుజుడు సంచరించనున్నాడు. ఈ సమయంలో మీరు మాటలను అదుపులో పెట్టుకోవాలి. కుటుంబంలో గొడవలు రావచ్చు. ఆకస్మిక ధననష్టం సంభవించవచ్చు. మెుత్తానికి ఈ సమయం మీకు నష్టాలను మిగులుస్తుంది. 


మిథునరాశి (Gemini)- మిథున రాశి యెుక్క లాభ మరియు ఋణ గృహాలకు అంటే 11వ మరియు 6వ గృహాలకు అధిపతిగా కుజుడిని పరిగణిస్తారు. ఈ రాశి యెుక్క ఆరో, ఏడో ఇంట్లో కుజుడు తిరోగమన స్థితిలో సంచరించనున్నాడు. ఈ సమయంలో మీ సోదరుడితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. మీ జీవిత భాగస్వామి యొక్క భావాలను నిర్లక్ష్యం చేయవద్దు.


Also Read: Dev diwali 2022: దేవ్ దీపావళి నవంబర్ 7 లేదా 8? సరైన తేదీ, ముహూర్తం, విశిష్టత తెలుసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook