Budh Gochar 2022: తిరోగమన బుధుడి సంచారం... ఈ రాశులవారికి బ్యాడ్ డేస్ స్టార్ట్...
Budh Gochar 2022: ఈనెల చివరిలో బుధుడు తిరోగమన స్థితిలో ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం ఏ రాశివారిపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Budh Gochar December 2022: డిసెంబరులో కొన్ని రాశులవారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ కానుంది. దీంతో వీరు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. ఈనెల 31న బుధుడు తిరోగమన స్థితిలో ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. తెలివితేటలు మరియు కమ్యూనికేషన్ కు కారకుడు బుధుడు. ధనుస్సు రాశిలో తిరోగమన బుధుడి సంచారం (Budh Gochar December 2022) వల్ల ఏ రాశులవారిని ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.
మేషం (Aries): తిరోగమన బుధుడు సంచారం కారణంగా ఈ రాశివారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. మీ లైఫ్ పార్టనర్ తో విభేదాలు రావచ్చు. ఈ సమయంలో మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోంటారు. నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో భారీగా నష్టాలు ఉంటాయి.
వృషభం (Taurus): మీరు కెరీర్ మరియు వ్యాపారంలో అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఇతరులతో మీ సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది. ఆఫీసులో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సమయంలో మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు అననుకూలంగా ఉంటుంది.
సింహరాశి (Leo): సింహ రాశి వ్యక్తులు తిరోగమన బుధుని సంచారం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో మరియు కుటుంబంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో మీకు ఫ్యామిలీ సపోర్టు లభించదు. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.
తుల రాశి (Libra): తిరోగమన బుధుడు సంచరించడం వల్ల ఈ రాశి వారికి ఈ సమయం బాగానే ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపవచ్చు. మీరు వ్యాపారంలో లాభాలను గడిస్తారు.
కుంభం (Aquarius): మీకు వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. బిజినెస్ విస్తరిస్తుంది. ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
Also Read: Mangal Margi 2023: కొత్త సంవత్సరంలో మార్గంలోకి కుజుడు.. ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook