COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Rishi Panchami 2023: హిందూ సాంప్రదాయం ప్రకారం..ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్షమి పంచమి రోజున ఋషి పంచమి జరుపుకుంటారు. ఈ వ్రతం స్త్రీలకు ఎంతో ముఖ్యమైనది. పెళ్లైన మహిళలు ఋషి పంచమి రోజు ఉపవాసాలు పాటించి ప్రత్యేక పూజలు చేయడం వల్ల మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ వ్రతంలో భాగంగా ఏడుగురు ఋషులను పూజించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ పూజలో భాగంగా తప్పకుండా పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఋషి పంచమి తిథి, శుభ సమయం, పూజా విధానం, ప్రాముఖ్యతను తెలుసుకుందాం.


ఋషి పంచమి 2023 ఎప్పుడంటే?:
ప్రతి సంవత్సరం వినాయక చవితి రెండవ రోజున బుషి పంచమిని జరుపుకుంటారు. భాద్రపద మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథి సెప్టెంబర్ 19 మధ్యాహ్నం 1:43 గంటలకు బుషి పంచమి సమయం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 20 మధ్యాహ్నం 2:16 గంటలకు ముగుస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ సంవత్సరం ఋషి పంచమిని 20 సెప్టెంబర్ జరుపుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. 


పూజా సమయం:
 ఋషి పంచమి వ్రతం పాటించేవారు బుధవారం ఉదయం 11:02 నుంచి మధ్యాహ్నం 1:28 గంటల వరకు పూజా కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పూజలో భాగంగా తప్పకుండా ఏడుగురు మహర్షులను పూజించడం శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. 


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  


ఋషి పంచమి పూజలో భాగంగా తప్పకుండా చేయాల్సిన పనులు:
ఋషి పంచమి పూజలో భాగంగా  ధూపం, దీపం, నెయ్యి, పండ్లు, పువ్వులు,  పంచామృతాలతో సహా అన్ని పూజ సామగ్రిని తీసుకోవాల్సి ఉంటుంది. 
మీ ఇంట్లో ఉండే చిన్న ఆలయాన్ని గంగా జలంతో శుభ్రం చేయాలి. 
ఆ తర్వాత ఏడుగురు మహర్షుల ఫోటోలను తీసుకోవాల్సి ఉంటుంది. 
ఈ స్వాముల ఫోటోల ముందు  పండ్లు, పూలు సమర్పించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మీరు పూజ కోసం తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి.
పూజ ముగిసిన తర్వాత  ఇంటి పెద్దల ఆశీస్సులు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. 


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook