Safala Ekadashi 2022 Date: హిందూ మతంలో ఈరోజు చాలా పవిత్రమైనది. ఎందుకంటే ఇవాళ అంటే 19 డిసెంబర్ 2022న సఫల ఏకాదశి. ఈరోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. అంతేకాకుండా ఈనెల చివరి రోజుల్లో కొన్ని శుభకరమైన యోగాలు ఏర్పడుతున్నాయి. సఫల ఏకాదశి రోజున బుధుడు, శుక్రుడు మరియు సూర్యుడు ధనుస్సు రాశిలో ఉండటం వల్ల బుధాదిత్య యోగం, లక్ష్మీ నారాయణ యోగం, త్రిగ్రాహి యోగం వంటి అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి.  ఈ యోగాలు 4 రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటాయి. ఈ శుభ యోగం ఏ రాశి వారికి అదృష్టాన్ని తెరుస్తుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): సఫల ఏకాదశి నాడు చేసే 3 శుభ యోగాల కలయిక వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ కెరీర్‌లో ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. మీరు తెలివిగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. వివాహం కుదిరే అవకాశం ఉంది. 


తుల రాశిచక్రం (Libra): ఇవాళ ఏర్పడే మూడు శుభ యోగాలు తుల రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీ పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. మీరు ఉద్యోగం మరియు వ్యాపారాల్లో గొప్ప విజయాలను సాధిస్తారు. ఈ సమయం మీకు అద్భుతంగా నడుస్తోంది. 


ధనుస్సు (Sagittarius): ధనుస్సు రాశి వారికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ మూడు శుభ యోగాలు ధనుస్సు రాశిలోనే ఏర్పడుతున్నాయి. దీంతో ఈ రాశి ప్రజల అదృష్టం ప్రకాశిస్తుంది. సర్వతోముఖ ప్రయోజనాలు పొందుతారు. అపారమైన ధనం సమకూరుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. 


మీనం (Pisces): మీనరాశి వారికి కూడా ఈ శుభ యోగాల కలయిక అద్భుతంగా ఉంటుంది. కొత్త జాబ్ ఆఫర్ పొందవచ్చు. ప్రమోషన్-ఇంక్రిమెంట్ పొందే అవకాశాలు ఉన్నాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. మెుత్తానికి ఈ సమయం మీకు బాగుంటుంది. 


Also Read: Budh Shukra Gochar 2022: శని రాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ 4 రాశులవారి జీవితాల్లో పెను మార్పు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook