Transit Of Mars 2022: కుజ గ్రహం సంచారం వల్ల సంసప్తక యోగం..మారనున్న ఈ రాశుల వారి జాతకం..
Samsaptak Yoga 2022: కుజ గ్రహం సంచారం వల్ల చాలా రాశులవారికి మంచి ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సంచార క్రమంలో ఆర్థిక సమస్యలు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.
Samsaptak Rajyog In Scorpio: కుజ గ్రహంలో చాలా రకాల మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా కుజ గ్రహం తన పొంత రాశిని వదిలి వృశ్చికరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే ఇప్పటికే శుక్రుడు, బుధ గ్రహాలు ఇప్పటికే వృశ్చికరాశిలో సంచారం చేశాయి. అయితే ఈ నాలుగు సంచారంతో సంసప్తక రాజయోగం ఏర్పడుతోందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగం వల్ల 12 రాశు వారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగం ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశువారికి ప్రయోజనాలే ప్రయోజనాల:
వృశ్చికరాశి:
కుజుడు వృశ్చికరాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిలో సంసప్తక యోగం ఏర్పడే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారికి ఈ రాజయోగం వల్ల చాలా శుభప్రదమైన గడియలు రాబోతున్నాయి. ఈ సంచారం క్రమంలోనే ప్రేమ పెళ్లి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ప్రేమ సంబంధాలలో మాధుర్యం దశ ప్రారంభం అవుతుంది. కోర్టు కేసుల సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ క్రబంలో విజయం పొందుతారు. అంతేకాకుండా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారికి చాలా ఈ క్రమంలో అన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. వ్యాపారాల్లో చాలా రకాల లాభాలు పొందే అవకాశాలున్నాయి. అయితే ఈ క్రమంలో తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించడం వల్ల మంచి ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి.
మకరరాశి:
మకరరాశి వారికి సంసప్తక యోగం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలిగే ఛాన్స్ ఉందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో ఈ రాశి వారు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో వ్యాపారాల్లో చాలా లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారు ఈ క్రమంలో పదోన్నతులు పొందే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆర్థికపర అంశాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పరిశ్రమలు నడుపుతున్నవారు ఈ క్రమంలో అధికంగా లాభాలు పొందే ఛాన్స్ ఉంది.
కన్య:
గ్రహాలు, రాశుల కదలికల వల్ల 12 రాశుల వారిలో మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కన్య రాశి వారు ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం క్రమంలో వ్యాపారంల్లో చాలా రకాల మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ క్రమంలో అదృష్టం వరించబోతోంది. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Also Read: Post Office Scheme: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి.. భారీ లాభం పొందండి
Also Read: Prince OTT: 'ప్రిన్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి