Samudrika Shastram: సాముద్రిక శాస్త్రంలో వ్యక్తి శరీరంపై కన్పించే మచ్చలు, మొటిమల గురించి వివరణ ఉంది. శరీరంపై వేర్వేరు భాగాల్లో కన్పించే మొటిమలకు అర్ధాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ముక్కుపై మొటిమ ఉండే మహిళైతే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరంలోని వేర్వేరు భాగాలపై పుట్టుమచ్చలు, మొటిమలుంటాయి. ఇది సహజం. అయితే శరీరంలో ఏ అంగంపై, ఏ భాగంపై ఉండటం దేనికి సంకేతమనేది సాముద్రిక శాస్త్రంలో వివరణ ఉంది. దేవుడిచ్చిన శుభ, అశుభ సంకేతాలని అంటారు. ఆ మొటిమలు లేదా మచ్చల ఆకారం ఎలా ఉండాలి..అది ఏ సంకేతమిస్తుందనేది తెలుసుకుందాం. వెంట్రుకల్లేని మొటిమ సౌభాగ్యానికి సంకేతం. ఒకవేళ మొటిమపై వెంట్రుకలుంటే మాత్రం అది హానికరం. ఒకవేళ గతంలో మొటిమలు లేకుండా..మధ్యలో వస్తే అది సమీప భవిష్యత్తులో హానికి సంకేతమని అర్ధమట.


గుడ్డు ఆకారంలో ఉండే మొటిమ లేదా మచ్చ వ్యక్తి సంపాదనపరుడనేందుకు సంకేతం కాగా, గోళాకారంలో ఉంటే ఆ వ్యక్తికి మంచి స్వభావాలుంటాయని అర్ధం. సాధారణం కంటే పెద్ద ఆకారంలో మొటిమలు ఎప్పుడూ అపరాధానికి సంకేతం. పెద్ద మొటిమలు వ్యక్తి పరాధీనుడని సంకేతం కాగా, తేజోవంతమైన మొటిమలు ఎప్పటికైనా బాధపెట్టేవని అర్ధం. 


ఎవరి కుడి చెంపపై మొటిమ లేదా మచ్చ ఉంటుందో వారివద్ద డబ్బులకు కొదవ ఉండదట. వారికి సంబంధించిన ఏ పని కూడా డబ్బుల కారణంగా నిలిచిపోదు. అటు ఎడమ చెంపపై మొటిమలుంటే ఆర్ధిక ఇబ్బందులు తప్పవని అర్ధం. సమీప భవిష్యత్తులో ఆర్ధిక కష్టాలుంటాయి. డబ్బులకు సంబంధించిన పనులు స్వయంగా చేసుకుంటే మంచిదని పండితులు సూచిస్తున్నారు. అదే నుదుట మద్యభాగంలో మొటిమ ఉంటే ఆ వ్యక్తి సరళంగా ఉంటూ ఇతరుల్ని ప్రేమిస్తాడని లేదా ప్రేమిస్తుందని అర్ధం. దాంతోపాటు ఈ మొటిమ మీపై ప్రేమ భావాన్ని పెంపొందిస్తుంది. నుదుట కుడివ వైపు  మొటిమ లేదా మచ్చ ఉంటే ఏదైనా రంగంలో నిష్ణాతులని అర్ధం. అటు ఎడమవైపుంటే మాత్రం..డబ్బులు ఎక్కువగా ఖర్చవుతుందని అర్ధం. 


కుడి కంటిరెప్పపై మొటిమ ఉంటే భార్య లేదా భర్తలో పరస్పరం ప్రేమ కన్పిస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకుంటారు. అటు ఎడమ కంటిరెప్పపై ఉంటే మాత్రం పూర్తిగా ప్రతికూలంగా ఉంటుంది. ఇద్దరిలో కోట్లాట ఎక్కువగా ఉంటుంది. 


ముక్కుపై మొటిమ ఉండే మహిళ


అదే ముక్కుపై మొటిమ ఉంటే ఆ వ్యక్తి లేదా మహిళ ప్రతిభ అసామాన్యమని..సంపన్నురాలని, సుఖ సంతోషాలు లభిస్తాయని అర్ధం. ముఖ్యంగా మహిళ ముక్కుపై మొటిమ సౌభాగ్యానికి సూచకం. ఇలాంటి మహిళతో పెళ్లైతే..ఆమె భర్త చాలా ఉన్నత స్థానంలో వెళ్తాడు. ఇలాంటి మహిళ చేతితో నష్టమనేది చాలా తక్కువనే చెప్పాలి. 


Also read: Venus and Diamond: వజ్రం ధరించినా ప్రయోజనం లేదా, ఇది పాటించండి చాలు.. ఆష్ట ఐశ్వర్యాలు మీవే ఇక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook