Sankashti Chaturthi 2022: రేపు సంకష్ట చతుర్థి... ఆ రోజున ఈ పనులు చేయకండి!
Sankashti Chaturthi April 2022: సంకష్తి చతుర్థి రోజున గణేశుడిని పూజించిన తర్వాత, రాత్రి చంద్రుడికి ఖచ్చితంగా అర్ఘ్యం సమర్పించాలి. ఇవే కాకుండా మరికొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం కూడా ముఖ్యం.
Sankashti Chaturthi April 2022 Shubh Muhurat and Chandrodaya Time: అన్ని చతుర్థిలు గణేశుడికి అంకితం చేయబడ్డాయి. ప్రతి నెలలో 2 చతుర్థులు ఉంటాయి. వీటిలో ఒకటి కృష్ణ పక్షంలో, మరొకటి శుక్ల పక్షంలో వస్తుంది. ఇందులో కృష్ణ పక్ష చతుర్థిని సంకష్టీ చతుర్థిగా (Sankashti Chaturthi), శుక్ల పక్ష చతుర్థిని వినాయక చతుర్థిగా జరుపుకుంటారు.
రేపు అంటే ఏప్రిల్ 19న వైశాఖ మాసం చతుర్థి తిథి. ఈ రోజున సంకష్టి శ్రీ గణేష్ చతుర్థి జరుపుకుంటారు. సంకష్టి చతుర్థి ఉపవాసం, పూజ చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే సంకష్ఠి చతుర్థికి శుభ ముహూర్తంలో పూజలు చేసి చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇది లేకుంటే పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది.
పూజ ముహూర్తం
చతుర్థి తిథి ఏప్రిల్ 19వ తేదీ మంగళవారం సాయంత్రం 04:38 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 20వ తేదీ మధ్యాహ్నం 01:52 గంటల వరకు కొనసాగుతుంది. చతుర్థి ఉపవాస సమయంలో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం అవసరం కాబట్టి, రాత్రి సమయం వచ్చే రోజునే చతుర్థిగా భావిస్తారు. ఈసారి సంకష్ట చతుర్థి నాడు చంద్రోదయ సమయం (Chandrodaya Time) రాత్రి 09:50.
సంకష్ట చతుర్థి నాడు ఈ పనులు చేయకండి:
**పొరపాటున కూడా గణేశునికి తులసిని సమర్పించవద్దు. అలా చేయడం అశుభంగా భావిస్తారు.
** జంతువులను, పక్షులను ఎప్పుడూ వేధించకూడదు. ఈ రోజున వాటికి ఆహారం, నీరు ఇవ్వడానికి ప్రయత్నించండి.
** సంకష్టి చతుర్థి రోజున పెద్దలను, బ్రాహ్మణులను అవమానించడం తప్పు. దీని వల్ల వినాయకుడు మీపై కోపగించుకోవచ్చు.
** సంకష్టి చతుర్థి రోజున మీ ప్రవర్తన బాగుండాలి. ఎవరికీ అబద్ధాలు చెప్పకండి, మోసం చేయకండి.
** సంకష్టి చతుర్థి రోజున మాంసాహారం, మద్యం సేవించవద్దు. ఈ రోజున కూడా ఇంట్లో ఆహారంలో వెల్లుల్లి-ఉల్లిపాయలను ఉపయోగించవద్దు. ఈ రోజు సాత్విక ఆహారాన్ని మాత్రమే తినండి.
Also Read: Saturn Transit 2022: మీన రాశి వారికి శని గండం... గట్టెక్కాలంటే ఇలా చేయాలంటున్న జ్యోతిష్య నిపుణులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook