Saphala Ekadashi 2022: సఫల ఏకాదశి రోజున ఇలా చేస్తే.. జీవితాంతం లాభాలే..లాభాలు..
Saphala Ekadashi 2022: కృష్ణ పక్షంలోని వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు. అయితే ఈ రోజు శ్రీ మహా విష్ణువుకు పూజా కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకావశాలున్నాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Saphala Ekadashi 2022: పౌషమాసం హిందువులకు ఎంతో ప్రముఖ్యమైనది. ప్రతి సంవత్సరంలో కృష్ణ పక్షం వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు. అయితే ఈ సంవత్సరం డిసెంబర్ 19న సఫల ఏకాదశి వస్తోంది. సాధారణంగా ప్రతి నెలలో రెండుసార్లు ఏకాదశి జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం 24 ఏకాదశులు వస్తే మాసంలోని ఒకటి శుక్ల పక్షం, మరొకటి కృష్ణ పక్షల్లో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే పూర్వీకుల నుంచి ప్రతి సఫల ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువును పూజిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో మహా విష్ణువుని పూజించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా మరణానంతరం కూడా మోక్షం లభించే అవకాశాలున్నాయి.
సఫల ఏకాదశి పూజ విధానం, శుభ సమయాలు:
శుభ సమయాలు:
ఏకాదశి తిథి ప్రారంభం:
19 డిసెంబర్ 2022 ఉదయం 03:32 గంటలకు ప్రారంభం.
ముగింపు ఏకాదశి తేదీ:
20 డిసెంబర్ 2022 మధ్యాహ్నం 02:32 గంటలకు ముగుస్తుంది.
వ్రత సమయాలు:
20 డిసెంబర్ 2022న ఉదయం 08:05 నుంచి 09:04 AM వరకు..
సఫల ఏకాదశి రోజున పలు రాశులవారు పూజా కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా ప్రయోజనాలు కూడా పొందొచ్చని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మేషం, వృషభం, సింహం, కన్యారాశి వారికి రాబోయే సంవత్సరం చాలా ఫలవంతంగా ఉండే అవకాశాలున్నాయి.
ఏకాదశి పూజా విధానం:
>>ఉదయాన్నే లేచి తల స్నానం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పట్టు వస్త్రాలు ధరించి.. భక్తితో ఇంటి గుడిలో దీపం వెలిగించాలి.
>>మీ దగ్గరలో ఉన్న శ్రీ విష్ణువు దేవాలయానికి గంగాజలంతో అభిషేకం చేయాలి. అంతేకాకుండా తులసి ఆకులతో తయారు చేసిన మాలను సమర్పించాల్సి ఉంటుంది.
>>అంతేకాకుండా వీలైతే 7 రోజుల పాటు ఉపవాసాలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మంచి లాభాలు పొందుతారు.
పూజా కార్యాక్రమంలో తప్పకుండా తీపి పదార్థాలను మాత్రమే నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది.
అంతేకాకుండా ఇదే క్రమంలో తులసి మాతకు, లక్ష్మి దేవి కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి.
Also Read: Man Raped Dog: సభ్యసమాజం తలదించుకునే ఘటన.. వీధి కుక్కపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం! వైరల్ వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook