Pitru Paksha and Sarva Pitru Amavasya 2022 Date: పితృ పక్షం 10 సెప్టెంబర్ 2022 నుండి ప్రారంభంకానుంది. ఇది సర్వ పితృ అమావాస్యతో ముగుస్తుంది. ఈసారి సర్వ పితృ అమావాస్య సెప్టెంబర్ 25వ తేదీన వస్తుంది. పితృ పక్షంలో ( Pitru Paksha 2022) చనిపోయిన పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని పూజలు చేస్తారు. అంతేకాకుండా వారి శాంతి కోసం శ్రాద్ధం, తర్పణం, పిండ ప్రదానం చేస్తారు. 15 రోజులపాటు సాగే పితృ పక్షంలో పూర్వీకులు భూమిపై ఉన్న తన కుటుంబ సభ్యులు చూడటానికి వస్తారని నమ్ముతారు.  పూర్వీకులు కలలో కనిపించి కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు ఇస్తారు. వాటిని అర్థం చేసుకుని వీలైనంత త్వరగా తగిన చర్యలు తీసుకోవాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కలలో పూర్వీకులను చూస్తే..
>> పితృ పక్షం సమయంలో పూర్వీకులు కలలో పదేపదే కనిపిస్తే, వారి కోరికలు కొన్ని నెరవేరకుండా ఉండిపోయాయని అర్థం. వారి ఆత్మ శాంతి కోసం పితృ పక్షంలో శ్రాద్ధం, తర్పణం, పిండ ప్రదానం చేయాలి. అలాగే బ్రాహ్మణులకు, పేదలకు దానం చేయాలి.  
>> పూర్వీకులు కలలో సంతోషంగా ఉంటే.. వారు మీతో సంతోషంగా ఉన్నారని అర్థం. అలాంటి కల జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సును పెంచుతుంది.
>> కలలో పూర్వీకులు దీవెనలు ఇస్తున్నట్లు కనిపిస్తే... మీరు త్వరలో పెద్ద పురోగతి లేదా విజయాన్ని పొందబోతున్నారని అర్థం. 
>> పూర్వీకులు ప్రశాంతంగా కనిపిస్తే... పూర్వీకుల ఆశీర్వాదంతో త్వరలో శుభవార్త వినబోతున్నారని అర్థం. 
>> మీ కలలో పూర్వీకులు ఏడుస్తున్నట్లు కనిపిస్తే.. అది అశుభానికి సంకేతం. మీరు అప్రమత్తంగా ఉండాలని అర్థం. ఈరోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి శ్రాద్ధం, దానం చేయండి. 
>> పూర్వీకులు మీకు దగ్గరగా కూర్చోవడం లేదా మీ కలలో మాట్లాడటం చూస్తే, వారు ఇప్పటికీ తమ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని వదులుకోలేకపోతున్నారని సంకేతం. అలాంటప్పడు పితృ పక్షం మరియు సర్వ పితృ అమావాస్య రోజున పూర్వీకులకు పిండదానం, తర్పణం మొదలైనవి చేయండి.


Also Read: Surya Gochar 2022: సూర్యుడి రాశి మార్పు... ఈ 3 రాశులకు టన్నుల కొద్ది అదృష్టం..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook