Surya Gochar 2022: సూర్యుడి రాశి మార్పు... ఈ 3 రాశులకు టన్నుల కొద్ది అదృష్టం..!

Sun Transit 2022 Effect: సూర్యుడి రాశిమార్పు ప్రతి ఒక్కరిపై పెను ప్రభావం చూపుతుంది. కన్యారాశిలో సూర్యుడి సంచారం మూడు రాశులవారికి అద్భుతంగా ఉండనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 3, 2022, 04:43 PM IST
Surya Gochar 2022: సూర్యుడి రాశి మార్పు... ఈ 3 రాశులకు టన్నుల కొద్ది అదృష్టం..!

Sun Transit 2022 Effect: ప్రతి నెలా సూర్యభగవానుడు తన రాశిని మారుస్తాడు. ప్రస్తుతం సూర్యుడు తన సొంత రాశి అయిన సింహరాశిలో ఉన్నాడు. ఈ నెల 17న సూర్యదేవుడు సింహరాశిని విడిచిపెట్టి కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. కన్యారాశిలో సూర్య సంచారం (Sun Transit in Virgo 2022) ప్రతి ఒక్కరి జీవితంపై పెను ప్రభావం చూపుతుంది. ఇది ముఖ్యంగా మూడు రాశులకు శుభప్రదంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

సింహం (Leo) : ప్రస్తుతం ఈ రాశిలోనే సూర్యభగవానుడు సంచరిస్తున్నాడు. ఈ రాశి నుండి వేరొక రాశికి సూర్యుడు మారిన ఈ రాశివారికి కలిసి వస్తుంది. వీరు అపారమైన సంపదను పొందుతారు.  ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇరుక్కుపోయిన డబ్బు మీవద్దకు తిరిగి వస్తుంది. కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. 

వృశ్చికం (Scorpio) : కన్యారాశిలో సూర్య సంచారం వృశ్చిక రాశి వారికి మేలు చేస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనేక మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు.  పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం.  

ధనుస్సు (Sagittarius): సూర్యుని సంచార ప్రభావం వల్ల ధనుస్సు రాశి వారికి కెరీర్ లో పురోగతి ఉంటుంది. వీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. భారీగా డబ్బు సంపాదిస్తారు. జాబ్ వచ్చే అవకాశం ఉంది. 

Also Read: Santana Saptami Vratam 2022: సంతాన సప్తమి వ్రతం ఎప్పుడు, శుభ సమయం, ప్రాముఖ్యత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 
 
 
 

Trending News