Sarva Pitru Amavasya 2022: సర్వ పితృ అమావాస్య ఎప్పుడు, శుభ సమయం, ప్రాముఖ్యత
Sarva Pitru Amavasya 2022: పితృ పక్షం సెప్టెంబర్ 10 నుండి ప్రారంభమవుతుంది. సర్వ పితృ అమావాస్య ఎప్పుడు మరియు ఈ రోజున పూర్వీకులకు ఎలా వీడ్కోలు చెప్పాలో తెలుసుకోండి.
Sarva Pitru Amavasya 2022: పూర్వీకులను ప్రసన్నం చేసుకునేందుకు పితృ పక్షం చాలా మంచి సమయం. ఈ ఏడాది పితృ పక్షం సెప్టెంబరు 10న ప్రారంభమై... 15 రోజులపాటు ఉంటుంది. ఈ రోజుల్లో ప్రజలు తమ పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని తర్పణం, పిండదానం, శ్రాద్ధ కర్మలు చేస్తారు. తద్వారా వారి ఆశీస్సులు పొందుతారు. పితృ పక్షం భాద్రపద మాసంలోని పౌర్ణమి నాడు ప్రారంభమై అశ్వినీ మాసం అమావాస్య రోజున ముగుస్తుంది. ఈ అమావాస్యనే సర్వ పితృ అమావాస్య అంటారు. ఇది ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం.
సర్వ పితృ అమావాస్య ప్రాముఖ్యత
సర్వ పితృ అమావాస్యను పితృ విసర్జని అమావాస్య అని కూడా అంటారు. ఇది పితృ పక్షానికి చివరి రోజు. శాస్త్రాల ప్రకారం, పితృ పక్షంలో పూర్వీకులు మరణించిన తేదీన వారిని స్మరించుకోవడం, పిండదానం, శ్రాద్ధం చేయడం అనవాయితీ. కానీ కొన్ని కారణాల వల్ల ఇది సాధ్యం కాకపోతే, సర్వ పితృ అమావాస్య రోజున మీ పూర్వీకుల పేరుపై బ్రాహ్మణులకు దానం చేయడం లేదా పేదవారికి ఆహారం ఇవ్వడం చేస్తారు. దీంతో మీ పూర్వీకులు సంతోషించి మీపై ఆశీస్సులు కురిపిస్తారు.
సర్వ పితృ అమావాస్య - 26 సెప్టెంబర్ 2022
అశ్వినీ శుక్ల పక్ష ప్రతిపద ప్రారంభం - 26 సెప్టెంబర్ 2022, ఉదయం 3:23 నుండి
అశ్వినీ శుక్ల పక్ష ప్రతిపద ముగింపు - 27 సెప్టెంబర్ 2022, ఉదయం 3.08 వరకు
సర్వ పితృ అమావాస్య నాడు పూర్వీకులకు ఎలా వీడ్కోలు చెప్పాలి?
>> సర్వ పితృ అమావాస్య రోజున స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించి పూర్వీకులకు పూజలు చేయాలి.
>> దక్షిణాభిముఖంగా కూర్చుని, రాగి పాత్రలో గంగాజలం లేదా శుభ్రమైన నీటిని తీసుకోండి. అందులో నల్ల నువ్వులు మరియు కొన్ని పచ్చి పాలు మరియు కుశ వేసి తర్పణం ఇవ్వండి. తర్పణం ఇచ్చేటప్పుడు 'ఓం పితృ గణయ్ విద్మహే జగధారిణ్యే ధీమః తన్నో పిత్రో ప్రచోదయాత్' అనే మంత్రాన్ని జపిస్తూ పూర్వీకుల శాంతి కోసం ప్రార్థించండి.
>> ఈ రోజున బ్రాహ్మణుల భోజనం పెట్టండి. ఇందులో ఖీర్ ఉండేటట్టు చూసుకోండి. అనంతరం వారికి బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకోండి.
Also Read: Rishi Panchami 2022: ఋషి పంచమి ఎప్పుడు, శుభ సమయం, పూజా సామగ్రి, వ్రత కథ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook