Rishi Panchami 2022 Date: హిందూమతంలో ఋషి పంచమి లేదా రిషి పంచమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున దీనిని జరుపుకుంటారు. ఈ రోజున ఏడుగురు మహర్షులను పూజించడం వల్ల జీవితంలో సుఖశాంతులు లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజున ఉపవాసం (Rishi Panchami 2022) ఉండడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. పంచాంగం ప్రకారం, ఋషి పంచమి సెప్టెంబర్ 1, గురువారం వస్తుంది. ఉదయం 11.05 నుండి మధ్యాహ్నం 1:37 వరకు శుభ సమయం. ఈ రోజు పూజలకు, మతపరమైన పనులకు చాలా మంచిది.
ఋషి పంచమి ప్రాముఖ్యత
అఖండ సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల రుతుక్రమ దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఋషి పంచమి రోజున మహిళలు గంగానదిలో స్నానం చేస్తే, దాని ఫలితాలు అనేక రెట్లు పెరుగుతాయని నమ్ముతారు. ఋషి పంచమి నాడు ఈ మంత్రాలను పఠించడం శుభప్రదంగా భావిస్తారు.
పూజ మంత్రం
కాశ్యపోత్రిర్భరద్వాజో విశ్వామిత్రోయ గౌతమ:.
జమదగ్నివాసిష్టశ్చ సప్తైతే ఋషయః స్మృతా ॥
సదా గృహ్ణాన్త్వవర్ధ్య మయా దత్తం తుష్ట భవత్ మే సదా।
పూజా సామగ్రి
ఈ రోజున సప్త ఋషులకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీళ్లతో అభిషేకం చేయాలి. రోలి, బియ్యం, ధూపం, దీపం మొదలైన వాటితో పూజించాలి. అనంతరం కథ వినాలి. తర్వాత నెయ్యితో హోమం చేయాలి.
ఋషి పంచమి కథ
భవిష్య పురాణంలోని ఒక కథ ప్రకారం, ఉత్తక అనే బ్రాహ్మణుడు తన భార్య సుశీలతో కలిసి నివశిస్తూ ఉంటాడు. అతనికి కుమారుడు, కుమార్తె ఉంటారు. ఇద్దరికీ పెళ్లిళ్లు జరుగుతాయి. కొన్ని రోజుల తర్వాత ఉత్తక బ్రహ్మణుడు కుమార్తె భర్త అకాల మరణం చెందుతాడు. దీంతో ఆమె తన పుట్టింటికి తిరిగి వస్తుంది. ఒక రోజు ఆమె నిద్రిస్తుండగా..కుమార్తె శరీరంపై పురుగులు పెరగడం ఆమె తల్లి చూసింది. కూతురి పరిస్థితిని భర్తకు చెబుతుంది. ఉత్తకడు ధ్యానం చేసి విషయం తెలుసుకుంటాడు. పూర్వ జన్మలో ఆమె రజస్వల సమయంలో తప్పు చేసింది. ఋషి పంచమి వ్రతం కూడా ఆచరించలేదు. దాని వల్లే ఆమె బాధలు అనుభవిస్తుంది. దానికి ప్రాయశ్చత్తంగా తండ్రి సూచన మేరకు ఆమె ఋషి పంచమి వ్రతాన్ని ఆచరించంది. దీంతో ఆమెకు శుభం జరిగింది.
Also Read: Vakri Grah 2022: కన్యారాశిలో బుధుడు తిరోగమనం... ఈ 3 రాశులకు బంపర్ బెనిఫిట్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook