Shadashtak Yog 2023 bad effect: ఆస్ట్రాలజీలో అంగారకుడు మరియు శనిదేవుడులను శత్రువులుగా భావిస్తారు. ఎవరి జాతకంలోని వీరిద్దరూ కలిసినప్పుడు లేదా ఒకరినొకరు చూసుకుంటున్నప్పుడు ఆ రాశి వారు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. రీసెంట్ గా శని మరియు అంగారకుడు అశుభకరమైన షడష్టక యోగాన్ని సృష్టించారు. ఈ యోగం 30 ఏళ్ల తర్వాత ఏర్పడింది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, జాతకంలో ఒకదానికొకటి ఆరు మరియు ఎనిమిదవ ఇంట్లో రెండు గ్రహాలు ఉన్నప్పుడు షడష్టక్ యోగం ఏర్పడుతుంది. శని మరియు కుజుడు కలయిక వల్ల ఏర్పడిన ఈ షడష్టక యోగం కొందరి జీవితాల్లో ప్రకంపనలు సృష్టించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటకం
శని, కుజుల అశుభ యోగం కర్కాటక రాశి వారు అనేక సమస్యల బారిన పడేలా చేస్తుంది. మీరు ఆర్థికంగా నష్టపోతారు. ఆస్తి వివాదంలో చిక్కుకునే అవకాశం ఉంది.  కుటుంబంలో కలహాలు రావచ్చు. ఎందులోనైనా పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ మాటలను అదుపులో ఉంచుకుంటే మీకే మంచిది.
కుంభం
అశుభకర యోగం వల్ల కుంభరాశి వారు అనేక సమస్యలను ఎదుర్కోనే అవకాశం ఉంది. మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీ దాంపత్య జీవితంలో అపార్ధాలు వస్తాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. 


Also read: Sun Transit 2023: ఇవాళ వృషభరాశిలోకి సూర్యుడు... వచ్చే నెల రోజులపాటు ఈ రాశులకు కష్టాలే కష్టాలు..


సింహం
శని అంగారకుడి షడష్టక యోగం సింహరాశి వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది. వీరు ఈ సమయంలో మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఈ సమయంలో మీ ఆదాయం తగ్గడం వల్ల ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. 
ధనుస్సు
షడష్టక యోగం ఈ రాశి యెుక్క ఎనిమిదో ఇంట్లో ఏర్పడుతుంది. ఈ సమయంలో మీకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మీరు మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాసం ఉంది. మీ లైఫ్ పార్టనర్ తో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. హెల్త్ విషయంలో కేర్ తీసుకోండి. 


Also read: Hanuman Jayanthi 2023: ఈ 3 రాశులపై హనుమాన్ ప్రత్యేక ఆశీస్సులు.. మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook