హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏదైనా గ్రహం మరో రాశిలో ప్రవేశిస్తే అప్పటికే ఆ రాశిలో మరో గ్రహముంటే ఈ రెండు గ్రహాల కలయికను యుతి అంటారు. శని, శుక్ర గ్రహాలు మకరరాశిలో యుతి ఏర్పాటు చేయనున్నాయి. ఫలితంగా కొన్ని రాశులకు అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. జ్యోతిష్యం ప్రకారం ఈ రెండు గ్రహాలకు మిత్రత్వం ఉన్నందున కొన్ని రాశుల జీవితంలో అద్భుతమైన సాఫల్యం లభించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభరాశి


మకరరాశిలో శుక్రుడు, శని యుతి కారణంగా ఈ రాశివారికి విశేషమైన లాభాలు కలగనున్నాయి. ఈ రాశి నవమ భాగంలో యుతి ఏర్పడనుంది. దీనిని భాగ్యం, విదేశీ యాత్ర అదృష్టంగా భావిస్తారు. అందుకే అదృష్టం వరిస్తుంది. భాగ్యం కలిసొస్తుంది. అటు విదేశాల్లో చదవాలనుకునే విద్యార్ధులు కోరిక నెరవేరుతుంది. వ్యాపారులు కూడా వ్యాపార వ్యవహారాల్లో విదేశీ యాత్ర చేస్తారు.


ధనస్సు రాశి


శుక్రుడు, శని గ్రహాల యుతి ధనస్సురాశివారికి శుభ సూచకం కానుంది. ఈ రాశి రెండవ భాగంలో యుతి ఏర్పడనుంది. దీనిని ధనానికి ప్రతీకగా పిలుస్తారు. ఈ క్రమంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అంతేకాదు ధార్మిక విషయాల్లో మెరుగైన స్థితి ఉంటుంది. వ్యాపారంలో నిలిచిపోయన డబ్బులు చేతికి అందుతాయి. ఈ సమయంలో ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు.


మీనరాశి


మీనరాశివారికి శని, శుక్ర గ్రహాల యుతి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి దశమభాగంలో యుతి ఏర్పడనుంది. దీనిని కార్యస్థలం, ఉద్యోగ స్థలంగా భావిస్తారు. ఈ సందర్భంగా ఆదాయం పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగౌతుంది. ఉద్యోగం చేసేవారికి విశేషమైన లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. తండ్రితో సంబంధం పటిష్టమౌతుంది. 


Also read: Vasantha panchami: వసంత పంచమి రోజు ఇలా చేస్తే..కచ్చితంగా సరస్వతి అనుగ్రహం, మెరుగైన ప్రతిఫలాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook