Shani Margi 2023 effect: ఆస్ట్రాలజీ ప్రకారం, ఏదైనా రాశిలో గ్రహం సక్రమ మార్గంలో నడవటాన్ని మార్గి అంటారు. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. నవంబరు 04 వరకు అదే స్థితిలో ఉంటాడు. ఆ తర్వాత మార్గంలోకి వస్తాడు.  గ్రహాలన్నింటిలోకెల్లా నెమ్మదిగా కదిలే గ్రహం శని. ఇతడు రెండున్నరేళ్లకొకసారి తన రాశిని మారుస్తాడు. శని మార్గి వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులారాశి
శని మార్గి తుల రాశి వారికి  శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు కెరీర్‌లో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం చాలా లాభాలను ఇస్తుంది. ఉద్యోగస్తులు పురోభివృద్ది సాధిస్తారు. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీకు సహోద్యోగుల సపోర్టు లభిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను గడిస్తారు. 
వృషభం
శని మార్గి వృషభరాశి వారికి చాలా మేలు చేస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మీకు మంచి ఉద్యోగం వస్తుంది. మీరు ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.


Also Read: Mercury transit 2023: కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న బుధుడు.. ఈ 5 రాశులకు కలిసి రానున్న కాలం..


మిధునరాశి
మిథున రాశి వారికి శని మార్గి అదృష్టాన్ని ఇవ్వనుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీరు మతపరమైన యాత్రకు వెళ్లే  అవకాశం ఉంది. మీరు ఈ సమయంలో ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. 


Also Read: Venus Transit 2023: జూలై 07 నుండి ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం.. మీది ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook