Shani Dev: హోలీ తర్వాత నక్షత్రాన్ని మార్చనున్న శని... ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభం..
Shani Gochar in March 2024: కర్మఫలదాత అయిన శనిదేవుడు హోలీ తర్వాత తన నక్షత్రాన్ని మార్చి.. బృహస్పతి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా కొందరి జీవితాల్లో వెలుగు రాబోతున్నాయి.
Shani Nakshatra Change 2024: సాధారణంగా శనిదేవుడు పేరు వినగానే అందరూ భయపడతారు. ఎందుకంటే శనిదేవుడు వక్రదృష్టి ఎవరిపై పడుతుందో వారి జీవితం క్షణాల్లో నాశనమైపోతుంది. అయితే కొన్నిసార్లు కర్మఫలదాత అయిన శని తన మంచి దృష్టిని కూడా మానవులపై ప్రసరిస్తూ ఉంటాడు. ఇతడి కటాక్షం ఉంటే కటిక పేదరికంలో ఉన్నవాడైనా కోటీశ్వరుడు అయిపోతాడు. అంతటి శక్తి శనిదేవుడు దృష్టికి ఉంటుంది. ఆస్ట్రాలజీ ప్రకారం, హోలీ పండుగ తర్వాత శనిదేవుడు పూర్వ భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీనికి అధిపతి దేవగురు బృహస్పతి. గురుడి నక్షత్రంలోకి శనిదేవుడు వెళ్లడం ఐదు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
మిథున రాశి
మిథునరాశి వారికి శనిదేవుడు నక్షత్ర మార్పు లాభదాయకంగా ఉంటుంది. మీకు డబ్బు సమస్యలు ఉండవు. లైఫ్ సాఫీగా సాగిపోతుంది. పెళ్లైయిన దంపతులకు సంతానసుఖం కలుగుతుంది. జాబ్ కోసం ట్రై చేసేవారు గుడ్ న్యూస్ వింటారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. హోలీ తర్వాత రైతన్నల కళ్లలో ఆనందం వెల్లివిరిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి.
సింహరాశి
హోలీ తర్వాత సింహరాశి వారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. చిన్న చిన్న వ్యాపారం చేసేమీరు పెద్ద బిజినెస్ చేసే స్థాయికి ఎదుగుతారు. మీరు భారీగా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఆర్థిక కష్టాలు దూరమవుతాయి. పెండింగ్ లో ఉన్న పనులు కంప్లీట్ అవుతాయి. మీరు పేదరికం నుండి బయటపడతారు. మీకు పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది.
మేష రాశి
శని నక్షత్ర మార్పు మేషరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు. వ్యాపారస్తులు మునుపటి కంటే మంచి లాభాలను ఆర్జిస్తారు. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మంచి పొజిషన్ కు వెళతారు. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు ఓ రేంజ్ లో లాభాలను తెచ్చిపెడతాయి. మీరు చేస్తున్న ఉద్యోగంలో గ్రోత్ ఉంటుంది.
Also Read: Chandra Grahan 2024: మార్చి 25న మెుదటి చంద్రగ్రహణం.. ఈ 3 రాశులకు బ్యాడ్ టైమ్..
Also Read: Astrology: హోలీ పండుగ ముందు ఈ 3 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం.. మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి