Chandra Grahan 2024: మార్చి 25న మెుదటి చంద్రగ్రహణం.. ఈ 3 రాశులకు బ్యాడ్ టైమ్..

Effect of Lunar Eclipse on Zodiac Signs: మరో మూడు రోజుల్లో తొలి చంద్రగ్రహణం రాబోతుంది. హోలీ రోజున ఏర్పడబోయే ఈ గ్రహణం మూడు రాశులవారికి సమస్యలను కలిగించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

Written by - Samala Srinivas | Last Updated : Mar 22, 2024, 07:46 PM IST
Chandra Grahan 2024: మార్చి 25న మెుదటి చంద్రగ్రహణం.. ఈ 3 రాశులకు బ్యాడ్ టైమ్..

Chandra Grahan 2024 negative effect: ఈ ఏడాది మెుదటి చంద్రగ్రహణం హోలీ పండుగ రోజున సంభవించబోతుంది. ఈ గ్రహణం మార్చి 25 ఉదయం 10:23 గంటలకు మెుదలై.. మధ్యాహ్నం 3:02 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు, దీంతో సూతక్ కాలం కూడా చెల్లదు. ఈ గ్రహణం ఎలాగూ మన దేశంలో కనిపించదు, కాబట్టి పూజలు చేసుకోవడంతోపాటు రంగుల హోలీ కూడా ఆడుకోవచ్చు. అయితే ఈసారి ఏర్పడబోయే చంద్రగ్రహణం మూడు రాశులవారికి ఇబ్బందులను తెచ్చిపెట్టనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

వృశ్చిక రాశి
మెుదటి చంద్రగ్రహణం వృశ్చికరాశి వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది. మీ హెల్త్ పాడయ్యే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉంది. ఈ సమయంలో కొత్త పనులు, వ్యాపారం మెుదలుపెట్టడం వంటి పనులు మానుకోండి. భార్యభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఆఫీసులో మీపై తప్పుడు ఆరోపణలు రావచ్చు. వ్యాపారులు నష్టాల చవిచూసే అవకాశం ఉంది. 
మీన రాశి
హోలీ నాడు సంభవించబోయే చంద్రగ్రహణం మీనరాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో గొడవలు వస్తాయి. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కేర్ పుల్ గా ఉండండి. 
కర్కాటక రాశి
తొలి చంద్రగ్రహణం కర్కాటక రాశి వారికి అశుభకరంగా ఉండబోతుంది. మీ జీవితంలో టెన్షన్ వాతావరణం ఉంటుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించదు. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు నష్టాలను మిగులుస్తాయి. వెహికల్ ను జాగ్రత్తగా నడపండి, లేదంటే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవల్సి రావచ్చు. 
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Solar Eclipse 2024: ఈ రాశులవారిపై సూర్యగ్రహణం ఎఫెక్ట్‌.. వీరికి లాభాలతో పాటు ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌..

Also Read: Chandra Grahan 2024: 100 ఏళ్ల తర్వాత హోళీ పండగ రోజు చంద్రగ్రహణం.. గ్రహణ కాలం, సూతకకాలం, పూర్తి వివరాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News