Saturn Retrograde 2023: హిందూ పంచాంగం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటుంది. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. కొన్నింటిపై అనుకూలంగా, మరి కొన్నింటిపై ప్రతికూలంగా ఉంటుంది. ప్రస్తుతం శని గ్రహం వక్రమార్గంతో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పరుస్తోంది. ఆ ప్రభావం ఎలా ఉండనుందో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి గ్రహానికి ఓ నిర్దేశిత రాశి ఉన్నట్టే శని గ్రహం రాశి కుంభం. ఈ రాశిలో శనిగ్రహం వక్రమార్గంతో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పరుస్తోంది. ఈ రాజయోగం ప్రభావం ముఖ్యంగా 3 రాశులపై ఉంటుంది. ఫలితంగా మూడు రాశులకు అద్భుత ప్రయజనాలు కలగనున్నాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం శని గ్రహాన్ని చేసిన కర్మకు ప్రతిఫలం ఇచ్చే దేవతగా భావిస్తారు. అందుకే శని గ్రహం అంటే అందరికీ భయముంటుంది. శని గ్రహం గ్రహాలన్నింటిలో నెమ్మదిగా కదిలే గ్రహం. అందుకే శని గ్రహం రాశి పరివర్తనం చెందడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంటుంది. శనిగ్రహం మార్గంలో ఏ స్వల్ప మార్పు సంభవించినా ఆ ప్రభావం కన్పిస్తుంది. జూన్ 17వ తేదీన శని గ్రహం వక్రమార్గం ఉంది. నవంబర్ 4 వవరకూ అదే మార్గంలో పయనించనుంది. ఈ సమయంలో అన్ని రాశులపై ప్రయోజనం కలుగుతున్నా...3 రాశులకు మాత్రం అద్భుతాలే కన్పిస్తాయి. 


మిధున రాశి


మిథున రాశి జాతకులకు శని వక్రమార్గం కారణంగా అదృష్టం తోడవుతుంది. అంతా అనుకూలంగా ఉంటుంది. సుదూర యాత్రలు చేస్తారు. తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు విజయం లభిస్తుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. 


వృషభ రాశి


శని గ్రహం వక్రమార్గం ప్రభావం అన్ని రాశులకు శుభప్రదంగానే ఉన్నా వృషభ రాశికి మాత్రం అత్యంత లాభదాయకం కానుంది. శనిగ్రహం వక్రమార్గంతో మూల త్రికోణ రాజయోగం ఏర్పరచడం కొన్ని రాశుల జాతకాలకు విశేష లాభాన్ని అందిస్తుంది. పదోన్నతులు ఉంటాయి. ఉద్యోగం మారే అవకాశముంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్ధికంగా ఏ విధమైన నష్టాలు కలగవు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.


సింహ రాశి


శని గ్రహం వక్రమార్గం సింహరాశికి అద్భుతమైన వరమని చెప్పాలి. నిత్యం ఘర్షణ , ఏదైనా వివాదం ఉంటే వెంటనే పరిష్కారమౌతుంది. శనిగ్రహం మీ వివాదాల్ని పరిష్కరిస్తుందని నమ్మకం. ఊహించని ధనలాభం కలుగుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు కలుగుతాయి. వ్యాపారులకు చాలా అనుకూలమైన సమయం.  వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది.


Also read: Shukhra Gochar 2023: శుక్ర సంచారంతో ఈ రాశి వారికి తెరుచుకోనున్న అదృష్టం.. వ్యాపారంలో నాలుగు రెట్ల లాభాలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook