Shukhra Gochar 2023: శుక్ర సంచారంతో ఈ రాశి వారికి తెరుచుకోనున్న అదృష్టం.. వ్యాపారంలో నాలుగు రెట్ల లాభాలు!

Luck will open for Virgo Zodiac Signs Peoples due to Shukhra Gochar 2023. మిధున రాశిలో శుక్రుడి సంచారం కన్యా రాశి వారిని ప్రభావితం చేస్తుంది. శుక్రు సంచారంతో ఈ రాశి వారికి అదృష్టం పట్టనుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : May 1, 2023, 08:48 PM IST
Shukhra Gochar 2023: శుక్ర సంచారంతో ఈ రాశి వారికి తెరుచుకోనున్న అదృష్టం.. వ్యాపారంలో నాలుగు రెట్ల లాభాలు!

Luck will open for Virgo Zodiac Signs Peoples due to Shukhra Gochar 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఓ నిర్దిష్ట సమయంలో తన రాశి చక్రాన్ని మారుస్తుంటుంది. 2023 మే 2న మధ్యాహ్నం 2.33 గంటలకు మిథున రాశికి శుక్రుడు చేరుకుంటాడు. దాదాపు నెల రోజులు మిథున రాశిలోనే ఉండి.. మే 30 సాయంత్రం 7.40 గంటలకు కర్కాటక రాశిలోకి వెళతాడు. మిధున రాశిలో శుక్రుడి సంచారం అన్ని లగ్నస్థులు మరియు రాశుల వారిపై ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కన్యా రాశి వారిని ప్రభావితం చేస్తుంది. శుక్రు సంచారంతో ఈ రాశి వారికి అదృష్టం పట్టనుంది. 

మిథున రాశికి శుక్రుడు సంచారం కన్యా రాశి వారికీ శుభప్రదంగా ఉంటుంది. కన్యా రాశి వారు ఈ సమయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమయం మీకు వృద్ధి కారకంగా ఉంటుంది. అదృష్టానికి పూర్తి మద్దతు లభిస్తుంది. దీని కారణంగా గతంలో నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీరు పనిచేసే సంస్థలో మీ జీతంలో పెరుగుదల ఉంటుంది. దీనితో పాటు ఉద్యోగి బదిలీ కూడా ఉండవచ్చు.ఈ బదిలీ ఆనందంగా ఉంటుంది. ఈ సమయంలో మీ పురోగతి వేగంగా ఉంటుంది.

కన్యా రాశి వ్యాపారస్తులు తమ వ్యాపార వృద్ధికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా అవన్నీ నిజమవుతాయి. వ్యాపారస్తుల లాభాలలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. దాని కారణంగా ఈ రాశి వారు చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారవేత్త లాభం కోసం మాత్రమే వ్యాపారం చేస్తాడు. కాబట్టి కోరుకున్నది పొందడం ప్రారంభిస్తే.. ఆనందంగా ఉంటుంది. శుక్రుని యొక్క ఈ మార్పు వ్యాపారవేత్తలకు చాలా ముఖ్యమైనదగా ఉంటుంది. కొత్త వ్యక్తులతో వ్యాపారాన్ని ముందుకు నడిపించే అవకాశం ఉంటుంది. అదృష్ట మద్దతుతో అన్ని పనులు సాధించబడతాయి.

కన్యా రాశికి చెందిన యువత మరియు విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. యువత తమ కెరీర్‌లో విజయం సాధిస్తారు. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. చాలా కాలం తర్వాత మీ జీవితంలో మంచి రోజులు వస్తాయి. శుక్రుని సంచారం మీ జీవితంలో సంతోషాన్ని నింపుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కానీ అనారోగ్యంతో ఉన్నవారు సంయమనం పాటించాలి. ఎప్పటికపుడు జాగ్రత్తగా చూసుకోవాలి. మొత్తంగా కన్యా రాశి వారికి శుక్ర సంచారం కలిసి రానుంది. 

Also Read: MS Dhoni IPL Retirement: ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ ఏమన్నాడంటే?  

Also Read: Kedar Jadhav RCB: బెంగళూరుకి భారీ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్! చెన్నై ప్లేయర్ ఇన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News