Saturn Retrograde 2023 will make Shash Rajyog: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని మేజిస్ట్రేట్ అని పిలుస్తారు. శని గమనంలో మార్పు మెుత్తం 12 రాశులవారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. జూన్ 17న శని గ్రహం తన సొంత రాశిచక్రమైన కుంభరాశిలో తిరోగమనం చేయబోతుంది. దీని కారణంగా షష్ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగాన్ని జ్యోతిష్యశాస్త్రంలో చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభ రాశి
శని తిరోగమనం కారణంగా కుంభరాశి వారు స్పెషల్ బెనిఫిట్స్ పొందనున్నారు. ఈ రాశి వారి జాతకంలోని లగ్న గృహంలో శనిదేవుడు తిరోగమనం చేయనున్నాడు. పైగా ఈ రాశికి అధిపతి కూడా అతడే. దీంతో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు.


సింహరాశి 
శష్ రాజయోగం సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. శనిదేవుడు మీ రాశి యెుక్క ఏడవ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీంతో మీరు ఆకస్మిక ధనలాభం పొందనున్నారు. పెళ్లికాని వారికి వివాహం ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీకు ఫ్యామిలీతో మంచి సమయం గడుపుతారు. 


Also Read: Venus-Mars Conjunction 2023: రాబోయే 27 రోజులు ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. మీరున్నారా?


వృశ్చిక రాశి
శని వక్రీ కారణంగా ఏర్పడిన షష్ రాజయోగం వృశ్చిక రాశి వారికి మేలు చేస్తుంది. మీ రాశి యెుక్క నాల్గో ఇంట్లో శనిదేవుడు సంచరిస్తున్నాడు. మీరు వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు మంచి ప్రయోజనాలు పొందబోతున్నారు. మీరు ఆర్థికంగా బలపడతారు.


Also Read: Budh Asta 2023: వృషభరాశిలో అస్తమించబోతున్న బుధుడు.. ఈ 3 రాశుల వారు పేదవారిగా మారడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook