Shani Retrograde Effect: శని వక్రమార్గం పట్టనుంది. శని కుంభరాశిలో ప్రవేశించడం కారణంగా..జూన్ 6వ తేదీ సాయంత్రం నుంచి ఏకంగా 140 రోజులపాటు..తీవ్ర దుష్పరిణామాలు సంభవించనున్నాయి. అవేంటి..ఏం చేస్తే విముక్తి లభిస్తుందో పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏదైనా గ్రహం వక్రమార్గం పడుతుంటే..దాని ప్రభావం అన్ని రాశులపై, వారి జీవితాలపై తీవ్రంగా ఉంటుంది. జూన్ 6 నుంచి శని తన కుంభరాశిలో వక్రమార్గం పట్టనుంది. అంటే జూన్ 6వ తేదీ సాయంత్రం నుంచి అక్టోబర్ 23 వరకూ ఏకంగా 140 రోజుల వరకూ కుంభరాశిలోనే ఉంటుంది జూన్ 6వ తేదీ సాయంత్రం 3 గంటల 16 నిమిషాల నుంచి కుంభ రాశిలో ప్రవేశించనుంది. మొత్తం 140 రోజులు శని వక్రమార్గంలోనే ఉండనుంది. 


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని దుష్ర్పభావంతో పీడింపబడుతుంటే..శని వక్రమార్గం వారి సమస్యల్ని పెంచుతుంటే..శనిదేవుడిని ప్రసన్నం చేసుకుంటే చాలా మంచిది. శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని పద్ధతులున్నాయి. ఈ పద్ధతుల ద్వారా శని దుష్ప్రభావం నుంచి బయటపడవచ్చు. ఆ పద్ధతులేంటో చూద్దాం..


శనిదేవుడిని కర్మ ఫలదాతగా, న్యాయ దేవతగా అభివర్ణిస్తారు. అందుకే శని దుష్ప్రభావం నుంచి బయటపడేందుకు ముందు నుంచే మంచి పనులు చేస్తుండాలి. ఇతరులకు సహాయం చేయాలి. ఎవరితోనూ అబద్ధమాడకూడదు, దొంగతనం చేయకూడదు, దురాశ వదిలేయాలి. 


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం నాడు లేదా నిర్ణీత పద్థతిలో శని బీజమంత్రం ఓం శ శనీశ్వరాయ నమహ లేదా ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనీశ్వరాయ నమహ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇలా చేస్తే శనిదేవత ప్రసన్నమై...భక్తుల కష్టాలు దూరం చేస్తుంది. 


శని పీడ నుంచి కాపాడుకునేందుకు శనివారం నాడు షమి చెట్టును పూజించాలి. నిర్ణీత పద్థతిలో షమి చెట్టుకు నీరు పోయాలి. శనివారం సాయంత్రం వేళ పూజ చేయాలి. ఆముదం నూనెతో దీపం వెలిగించాలి. షమి చెట్టు శనిదేవుడికి ప్రీతిపాత్రమైంది. అందుకే శనివారం నాడు షమి చెట్టు పూజలు చేయాలి.


శనివారం నాడు రావిచెట్టుపై శనిదేవుడి నీడ ప్రసరిస్తుందని చెబుతారు. అందుకే శనిదేవుడి కటాక్షం పొందేందుకు శనివారం నాడు రావిచెట్టును పూజించాలి. దాంతోపాటు ఆముదం నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శని దుష్ప్రభావం, శనిపీడ విరగడవుతుందని నమ్మకం. 


శని వక్రదృష్టి నుంచి బయటపడేందుకు శనిదేవుడికి పూజలు చేయాలి. ఆ తరువాత శని కలచం, శని రక్షా స్తోత్రం పఠించాలి. శనివారం నాడు కుక్కలు, గాడిదలు, గుర్రాలు, జింక, నెమలి వంటి ఏ జంతువులకు హాని కల్గించకూడదు. ఇవన్నీ శనిదేవుడి వాహనాలు అయినందున...శనిదేవుడికి ఆగ్రహం రాకుండా చూసుకోవాలి. శనివారం నాడు వ్రతం ఆచరించాలి. శని చాలీసా పఠించి..హారతి ఇస్తే శనిదేవుడి కటాక్షం లభిస్తుందని చెబుతారు. 


Also read: Amarnath Yatra Dates: అమర్‌నాథ్ యాత్ర తేదీలు ఖరారు, జూన్ 30 నుంచి 43 రోజులు సాగనున్న యాత్ర


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook