Shani Transit: 2024 సంవత్సరంలో శని గ్రహం తిరోగమనం..ఈ రాశులవారికి లాభాలతో పాటు సమస్యలు తప్పవు!
Shani Transit 2023: రాబోయే 2024 సంవత్సరంలో శని గ్రహం తిరోగమనం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. ఈ ప్రభావం వల్ల వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు వస్తాయి. జాతకం ప్రకారం శని శుభ స్థానంలో ఉన్నవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి.
Shani Transit 2023: జ్యోతిషం శాస్త్రం ప్రకారం శని గ్రహం జాతకంలో శుభ స్థానంలో ఉంటే వ్యక్తిగత జీవితాల్లో సుఖానికి సంపదకు ఎలాంటి లోటు ఉండదు. ఇదే గ్రహం చెడు స్థానంలో ఉంటే అనేక రకాల సమస్యలు రావడమే కాకుండా విపరీతంగా నష్టపోతారు. అందుకే చాలామంది శని దేవుని కర్మ ప్రదాతగా భావిస్తారు. శని వ్యక్తుల కర్మలను బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అయితే శని గ్రహం 2024 సంవత్సరంలో తిరుగమనంతో పాటు ప్రత్యక్ష కదలికలను చేయబోతోంది. అయితే ఈ గ్రహంలో వచ్చే మార్పుల కారణ అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు.
మేష రాశి:
కుంభరాశిలో శని గ్రహం కదలికల కారణంగా 2024 సంవత్సరంలో మేష రాశి వారు లాభాలు పొందుతారు. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా అనేక మార్పులు వచ్చి కొత్త పనులు కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సమయంలో ఈ రాశి వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. కుటుంబ జీవితం గడుపుతున్న వారికి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. అయితే ఈ సమయంలో నోటి మాటలను అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. లేకపోతే భాగస్వామితో విభేదాలు కూడా రావచ్చు.
సింహరాశి:
కుంభ రాశిలో శని గ్రహం ప్రత్యేక స్థానంలో ఉండడం కారణంగా రాబోయే 2024 సంవత్సరంలో సింహ రాశి వారి జీవితాల్లో కూడా అనేక రకాల మార్పులు వస్తాయి. ఈ రాశి వారు శని గ్రహం అనుగ్రహంతో ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసే వారికి కూడా అదృష్టం కలిసి వస్తుంది. ఇక ప్రేమ జీవితం విషయానికొస్తే అనేక సమస్యలు రావచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రాశి వారు కూడా మాటలను అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
తులారాశి:
2024 సంవత్సరంలో శని గ్రహ తిరోగమనం కారణంగా తులా రాశి వారు అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. ఇక తులారాశి వారు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. ఆరోగ్య విషయానికొస్తే ఈ సమయంలో కొన్ని అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టు ముట్టే అవకాశాలున్నాయి. కాబట్టి ముందుగానే అనారోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు కూడా ఈ సమయంలో అనేక శుభవార్తలు వింటారు.యి. అందువల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. విద్యార్థులు కూడా కొన్ని శుభవార్తలను అందుకుంటారు.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి