Saturn Retrograde Effect : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల్లో అత్యంత నెమ్మదిగా కదిలేది శని గ్రహం. శని గ్రహం ప్రస్తుతం తిరోగమన స్థితిలో ఉంది. గతేడాది అక్టోబర్ 11న మకర రాశిలోకి ప్రవేశించిన శని ఈ ఏడాది ఏప్రిల్ 29న కుంభరాశిలోకి ప్రవేశించింది. తిరిగి ఇప్పుడు తిరోగమనంలో మళ్లీ మకర రాశిలోకి ప్రవేశించనుంది. జూలై 12న శని మకర రాశిలోకి ప్రవేశిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 17న మళ్లీ కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ ఆర్నెళ్ల పాటు శని తిరోగమనం 3 రాశుల వారిపై ప్రభావం చూపనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్నెళ్ల పాటు ఈ మూడు రాశులకు అంతా అదృష్టమే :


వృషభం: శని తిరోగమనం వృషభ రాశి వారికి అన్నివిధాలా కలిసొస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి కోరుకున్న జాబ్ దొరుకుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారికి అన్నీ అనుకూలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక స్థితి బలోపేతమవుతుంది. ఇతరులకు సాయం చేసే స్థితిలో ఉంటారు తప్ప ఎవరి నుంచి ఏమీ ఆశించరు.


ధనుస్సు: శని సంచారం ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా కలిసొస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. పెట్టుబడులు లాభాలు తీసుకొస్తాయి. కొందరికి ఊహించిన దాని కన్నా ఎక్కువ లాభాలు ఉంటాయి. వ్యాపారులకు ధన లాభం ఉంటుంది. రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం.


మీనం: ఈ రాశి వారికి శని తిరోగమనం అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో ఉన్నవారు సత్ఫలితాలు పొందుతారు. వ్యాపార వర్గాలకు లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఉద్యోగ ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. శని తిరోగమనంలో ఈ రాశి వారికి డబ్బు, ప్రతిష్ఠ పెరుగుతాయి. వివాదాల్లో విజయం మీదే అవుతుంది.


(నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read: Rape Case: పరస్పర అంగీకారంతో లైంగిక చర్య తర్వాత పెళ్లికి నిరాకరిస్తే.. అది అత్యాచారం కాదు.. కేరళ హైకోర్టు కీలక తీర్పు..   


Also Read: Hyderabad Rains:హైదరాబాద్ లో కుండపోత.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. పవర్ కట్ తో నరకం..



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook