Kerala HC Rule on Rape Case: ఓ న్యాయవాదిపై అత్యాచార ఆరోపణల కేసులో కేరళ హైకోర్టు శుక్రవారం (జూలై 8) కీలక తీర్పు వెలువరించింది. పరస్పర అంగీకారంతో లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తే దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని న్యాయస్థానం పేర్కొంది. పరస్పర అంగీకారం లేకుండా లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు లేదా బలవంతంగా, మోసపూరితంగా లైంగిక చర్యకు ఒప్పించేలా చేసినప్పుడు మాత్రమే అది అత్యాచారంగా పరిగణించబడుతుందని పేర్కొంది. నవనీత్ నాథ్ అనే న్యాయవాదిపై అత్యాచార ఆరోపణల కేసులో జస్టిస్ బెచు కురియన్ థామస్ ఈ తీర్పు వెలువరించారు.
వివాహానికి కట్టుబడలేదనే కారణంతో లైంగిక చర్యను అత్యాచారంగా పరిగణించాలంటే.. ఆ మహిళ వివాహ హామీ వల్లే లైంగిక చర్యలో పాల్గొని ఉండాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం ఇద్దరు వయోజనులైన వ్యక్తుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే లైంగిక చర్య రేప్ కిందకు రాదని తెలిపారు. పరస్పర అంగీకారంతో లైంగిక చర్యలో పాల్గొని.. ఆ తర్వాత వివాహం చేసుకునేందుకు నిరాకరించినా, ఆ సంబంధం వివాహ సంబంధంగా మారకపోయినా.. ఇవేవీ ఆ లైంగిక చర్యను అత్యాచారంగా పరిగణించేందుకు కారకాలు కావని స్పష్టం చేశారు.
నవనీత్ నాథ్ అనే కేరళ హైకోర్టు న్యాయవాది తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఆ తర్వాత మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడని ఆరోపిస్తూ కేరళ హైకోర్టుకే చెందిన ఓ మహిళా న్యాయవాది అతనిపై కేసు పెట్టారు. ఈ కేసులో అరెస్టయిన నవనీత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు బెంచ్.. నవనీత్‌కు బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది.
నవనీత్ తరుపు న్యాయవాది రమేశ్ చందర్ ఈ కేసుపై మాట్లాడుతూ.. నవనీత్ ఆమెను పెళ్లి చేసుకుటానని ఎప్పుడూ చెప్పలేదని, ఇద్దరి మధ్య సహజంగానే శారీరక సంబంధం ఏర్పడిందని పేర్కొన్నారు. స్త్రీ-పురుషుల మధ్య సంబంధం కుటుంబ సభ్యుల అభ్యంతరాలతో లేదా మరేదైనా కారణాలతో వివాహ సంబంధంగా మారకపోతే దాన్ని రేప్‌గా పరిగణించలేమన్నారు.
Also Read: Horoscope Today July 9th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు..
Also Read: Amarnath Cloudburst:15కు పెరిగిన అమర్ నాథ్ మృతులు... తృటిలో తప్పించున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Rape Case: పరస్పర అంగీకారంతో లైంగిక చర్య తర్వాత పెళ్లికి నిరాకరిస్తే.. అది అత్యాచారం కాదు.. కేరళ హైకోర్టు కీలక తీర్పు..
కేరళ హైకోర్టు కీలక తీర్పు
పరస్పర అంగీకారంతో లైంగిక చర్యలో పాల్గొంటే అత్యాచారం కిందకు రాదు
పరస్పర అంగీకారంతో లైంగిక చర్యలో పాల్గొని.. ఆ తర్వాత పెళ్లికి నిరాకరిస్తే అది రేప్ కాదు