Shani Vakri 2024 Positive Effect: ప్రతి నెలా కొన్ని గ్రహాలు తమ రాశులను మారుస్తాయి. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. 2024లో కూడా గ్రహాల గమనంలో పెను మార్పు రాబోతోంది. పురాణాల ప్రకారం, సూర్యదేవుడు కుమారుడు శని. ఇతడి అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. అదే శని వక్రదృష్టి పడిందంటే ధనవంతుడు కూడా దరిద్రుడిగా మారతాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనం చేసే మంచి చెడుల ప్రకారం ఫలితాలను ఇస్తాడు కాబట్టి శనిదేవుడు న్యాయదేవుడు అని పిలుస్తారు. ప్రస్తుతం శని గ్రహం కుంభరాశిలో సంచరిస్తోంది. 2025 వరకు అదే రాశిలో ఉండనుంది. వచ్చే ఏడాది జూన్ 30 నుండి నవంబర్ 15 వరకు శని తిరోగమనంలో సంచరించనుంది. ఈ శని రివర్స్ కదలిక కొందరికి అనుకూలంగానూ, మరికొందరికి ప్రతికూలంగా ఉండనుంది. శని వక్రీ ప్రభావం కొత్త సంవత్సరంలో ఏయే రాశులవారు బెనిఫిట్స్ పొందబోతున్నారో తెలుసుకుందాం. 


మేషరాశి
శని రివర్స్ కదలిక మేషరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. వీరి ఆదాయం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను ఇస్తాయి. శనిదేవుని అనుగ్రహంతో జాబ్ తోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. ఉద్యోగులు తమ స్వస్థలాలకు ట్రాన్సఫర్ అవ్వాలనుకుంటే మంచి సమయం. మెుత్తానికి శనిదేవుడి కటాక్షంతో మేషరాశి జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 
మకర రాశి
మకర రాశికి అధిపతి శని. దీని కారణంగా కొత్త సంవత్సరంలో ఏ రాశి వారికి ఏ లోటు లేకుండా చూసుకుంటాడు శని. వీరి ఆర్థిక స్థితిగతులు మునుపటి కంటే బాగుంటాయి. స్థిర చరాస్తులు కలిసి వస్తాయి. కెరీర్ లో పురోగతి ఉంటుంది. బిజినెస్ చేసేవారు భారీ మెుత్తం లాభాలను పొందుతారు. వీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. 


Also Read: Guru Pushya Yoga: త్వరలో చివరి గురు పుష్య యోగం.. ఇలా చేస్తే కోటీశ్వరులే..!


సింహరాశి
న్యూ ఇయర్ లో సింహరాశి వారికి స్పెషల్ బెనిఫిట్స్ ఇవ్వనున్నాడు శని. వీరి జాతకంలో శష్ అనే రాజయోగం ఏర్పరిచి.. వారికి ఊహించని మెుత్తంలో డబ్బును ఇవ్వనున్నాడు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. పిల్లలు లేని వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. జాబ్ చేసేవారికి ప్రమోషన్ వస్తుంది. 


Also Read: Sun Mercury Conjunction 2023: మరో 24 గంటల్లో ఈ 3 రాశుల దశ తిరగబోతోంది..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook