Guru Pushya Yog 2023 Significance: హిందూ పంచాంగం ప్రకారం, గురువారం నాడు పుష్య నక్షత్రం ఏర్పడితే దానిని గురు పుష్య యోగం లేదా గురు పుష్య నక్షత్రం అని పిలుస్తారు. ఈ సంత్సరంలో చివరి గురు పుష్య యోగం డిసెంబరు 29న సంభవించబోతుంది. అయితే ఈ ప్రత్యేకమైన రోజునాడు షాపింగ్ చేయడం మంచిదని అంటారు. ఇందులో భాగంగానే ఎక్కువ మంది బంగారం మెుదలైన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ రోజు కొన్న వస్తువులు ప్యూచర్ లో రెట్టింపు లాభాలను ఇస్తాయని వీరి నమ్మకం. గురు పుష్య నక్షత్రం ప్రాముఖ్యత మరియు పూజా సమయం గురించి తెలుసుకుందాం.
ప్రాముఖ్యత
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మొత్తం 27 నక్షత్రాలు, 12 రాశులు ఉంటాయి. ఈ 27 నక్షత్రాల్లో ఎనిమిదో స్టార్ పుష్య. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు చాలా పవర్ పుల్. అంతేకాకుండా వీరు ఎంతో తెలివైన వారు మరియు భక్తి కలవారు. పుష్య నక్షత్రాన్ని బృహస్పతి మరియు శని గ్రహాలు పాలిస్తాయి. బృహస్పతి గురువారం పుష్య నక్షత్రంలో వచ్చిన రోజున శుభకరమైన యోగం ఏర్పడుతోంది. దీనినే గురుపుష్య యోగం అని అంటారు.
గురు పుష్య యోగం తేదీ
డిసెంబర్ 29వ తేదీ తెల్లవారుజామున 3:05 గంటలకు గురు పుష్య నక్షత్రం ప్రారంభమై..తర్వాత రోజు అంటే డిసెంబరు 30 తెల్లవారుజామున 3:10 గంటలకు ముగుస్తుంది. ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి, కొత్త పని మెుదలపెట్టడానికి ఇది శుభకరమైన రోజు. ఈ రోజు షాపింగ్ చేసేవారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అందుకే చాలా మంది ఈ పవిత్రమైన దినాన బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు.
Also Read: Sun Mercury Conjunction 2023: మరో 24 గంటల్లో ఈ 3 రాశుల దశ తిరగబోతోంది..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook