Saturn rising 2023 today: గ్రహాలు కాలానుగుణంగా ఉదయిస్తాయి. హోలీకి ముందు అంటే ఇవాళ శనిదేవుడు కుంభరాశిలో ఉదయించాడు. ఎవరి జాతకంలో శనిదేవుడు శుభస్థానంలో ఉంటాడో వారికీ దేనికీ లోటు ఉండదు. ఈరోజు శనిదేవుడు ఉదయించిన వెంటనే నాలుగు రాశులవారికి ఐశ్వర్యం, పురోభివృద్ధి కలుగుతాయి. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనిదేవుడి ఉదయం ఈ రాశులకు వరం
వృషభ రాశి
శనిదేవుని ఉదయించడం వల్ల వృషభ రాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. మీకు ప్రతి విషయంలో అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారంలో విజయం సాధిస్తారు. అనుకోకుండా ధనం పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మెుత్తానికి ఈ సమయం మీకు మంచి ప్రయోజనాలను ఇస్తుంది. 
సింహ రాశి
శనిదేవుడి రైజింగ్ మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో ఏడవ ఇంట్లో శనిదేవుడు ఉదయించబోతున్నాడు. దీంతో మీ వైవాహిక జీవితం బాగుంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో భారీగా లాభాలు ఉంటాయి. కొత్త పనులు మెుదలుపెట్టడానికి ఇదే అనుకూల సమయం. 
తులా రాశిచక్రం
శనిదేవుడి ఉదయించడం వల్ల మీరు ఆర్థికంగా లాభపడతారు. శనిదేవుడు మీ సంచార జాతకంలోని నాల్గవ మరియు ఐదో ఇంటికి అధిపతి. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది.  పాలిటిక్స్ లో ఉన్నవారు పదవి పొందుతారు.
మకర రాశిచక్రం
శనిదేవుడి గమనంలో మార్పు మీకు శుభప్రదంగా ఉంటుంది. మీకు అదృష్టం పెరుగుతుంది. ఆఫీసులో మీ ప్రాబల్యం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ మాటలతో ప్రజలను ఆకట్టుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. మీకు విదేశీ యోగం కూడా ఉంది.


Also Read: Gajkesari Rajyog: ఉగాది తర్వాత 'గజకేసరి రాజయోగం'.. ఈ రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook