Gajkesari Rajyog: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఫ్లానెట్స్ టైం ప్రకారం తమ జొడాయిక్ ను ఛేంజ్ చేస్తాయి. దీని కారణంగా ఈ రాశులు శుభ మరియు అశుభ యోగాలను సృష్టిస్తాయి. మార్చి 22న ఉగాది పండుగ రాబోతుంది. సరిగ్గా నెలరోజుల తర్వాత ఏప్రిల్ 22న దేవగురువు బృహస్పతి మీనరాశిని విడిచిపెట్టి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదేరాశిలో గురు, చంద్రుడు కలిసి అరుదైన గజకేసరి రాజయోగాన్ని సృష్టిస్తున్నారు. ఈ యోగం వల్ల మూడు రాశులవారికి ఆకస్మిక ధనం, వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
గజకేసరి రాజయోగం ఈ రాశులకు వరం
ధనుస్సు రాశిచక్రం
గజకేసరి రాజయోగం కారణంగా ధనుస్సు రాశి వారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. ఎందుకంటే మీ రాశి నుండి ఐదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీంతో వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. ప్రేమ చిగురుస్తుంది. దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. బిజినెస్ చేసేవారు పెద్ద డీల్స్ ను కుదుర్చుకునే అవకకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది.
మిథున రాశిచక్రం
గజకేసరి రాజయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకానికి సంబంధించిన ఆదాయ గృహంలో ఈ యోగం ఏర్పడుతోంది. మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు పాతపెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు. స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇదే మంచి సమయం. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.
మేష రాశిచక్రం
ఉగాది తర్వాత మేషరాశి వారికి గోల్డెన్ డేస్ ప్రారంభమవుతాయి. ఎందుకంటే మీ లగ్న గృహంలో ఈ యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. మీకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. జాబ్ చేసేవారికి పదోన్నతి లభిస్తుంది.
Also Read: Guru Shukra Gochar: యవ్వనంలోకి ప్రవేశించిన గురుడు-శుక్రుడు.. ఈ 4 రాశులకు అపారమైన ధనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Gajkesari Rajyog: ఉగాది తర్వాత 'గజకేసరి రాజయోగం'.. ఈ రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు