COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Saturn Retrograde In Aquarius 2023: న్యాయ దేవతగా భావించే శని గ్రహం తిరోగమన స్థితిలో సొంత రాశిలోకి కాదలబోతున్నాడు. దీని కారణంగా మొత్తం 12 రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కర్మ దాత శనిని నవంబర్‌ 04వ తేదిన ప్రత్యేక్షంగా కుంభరాశిలోకి తిరోగమనం చేయబోతున్నాడు. దీని కారణంగా దీపావళి కంటే ముందు రోజు నుంచే కొన్ని రాశులవారికి ఊహించని నష్టాలు కలుగబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ శని గ్రహ ప్రభావం ఏయే రాశులవారిపై పడే అవకావాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


ఈ రాశులవారిపై శని అనుగ్రహం:
మేష రాశి:

శని దేవుడి తిరోగమనం కారణంగా మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శని అనుగ్రహం కారణంగా మేష రాశివారికి గౌరవం పెరుగుతుంది. దీంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో మరింత వారి సేవలు విస్తరించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా శని తిరోగమనం కారణంగా పాత స్నేహితులను కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా నెరవేరుతాయి. 


వృషభ రాశి:
వృషభ రాశికి కూడా శని దేవుడి ప్రత్యేక అనుగ్రహం లభించి అనుకున్న పనులు సులభంగా చేయగలుగుతారు. ఇక వ్యాపారాలు చేసేవారు ఆర్థికంగా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. దీంతో పాటు అనేక రకాల శుభవార్తలు వింటారు. కుటుంబంతో ఈ సమయంలో సంతోషంగా ఉంటారు. అంతకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి


మిథున రాశి:
శని తిరోగమనంతో మిథున రాశి వారు ఆర్థికంగా బలపడతారు. అంతేకాకుండా అప్పులు కూడా సులభంగా తిరిగి చెల్లిస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు భవిష్యత్‌లో కూడా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వృత్తి పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు ఆర్థికంగా వీరి జీవితాల్లో చాలా రకాల మార్పులు జరుగుతాయి. అనుకున్న పనులు చేసి కుటుంబంతో సంతోషంగా ఉంటారు. 


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి