Saturn Rise Horoscope 268 Days: శని దేవుడిని కర్మ ప్రదాతగా భావిస్తారు. ఎందు కంటే ఈ దేవుడు వ్యక్తులు చేసే కర్మలను బట్టి ఫలాలు ఇస్తాడు. అంతేకాకుండా ఈ శని గ్రహం సంచారం చేయడం వల్ల కూడా కర్మలకు అనుగుణంగా ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. శని గ్రహం జాతకంలో శుభ స్థానంలో ఉంటే కటిక పేదరికంలో జీవించేవారు కూడా ధనవంతులవుతారు. దీంతో పాటు ఇదే గ్రహం అశుభ స్థానంలో ఉంటే విపరీతమైన సమస్యలు వస్తాయి. ప్రస్తుతం శని కుంభ రాశిలో సంచార క్రమంలో ఉంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 28న ఈ గ్రహం మరో రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఈ రోజు నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 268 రోజుల పాటు ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మేష రాశి:

మేష రాశి వారికి మరో 268 రోజుల పాటు చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో మేష రాశివారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి సహోద్యోగుల మద్దతుతో అనేక ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా వీరు ప్రమోషన్స్‌ పొందే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు ఆర్థికంగా కూడా విపరీతమైన లాభాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే విదేశాలు వెళ్లేవారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. అయితే ఈ సమయంలో తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ఛాన్స్‌ ఉంది. 


తుల రాశి: 
శని కదలికల కారణంగా తుల రాశివారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి జీతాలు కూడా విపరీతంగా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా కుటుంబంలో శాంతి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఈ సమయంలో స్నేహితుల సహాయంతో జీవితంలో వస్తున్న కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా ఆనందం కూడా పెరుగుతుంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


సింహ రాశి:
శని సంచారం చేయడం వల్ల సింహ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఏళ్ల తరబడి నిలిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. దీంతో పాటు ఆర్థింగా కూడా చాలా లాభాలు పొందుతారు. దీంతో పాటు కెరీర్‌కి సంబంధించిన జీవితంలో కూడా అనేక మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యక్తిగత జీవితంలో సంతోషం, శాంతి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ప్రేమ జీవితంలో కూడా మార్పులు వస్తాయి. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి