Saturn Planet Transit 2023: ప్రతి గ్రహం పర్టికలర్ టైం తర్వాత తన రాశిని ఛేంజ్ చేస్తుంది. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇదే సమయంలో శని తమ దశమ దృష్టిని, శుక్ర గ్రహం తన సప్తమ దృష్టిని వృశ్చికరాశిపై ఉంచుతారు. దీని కారణంగా శష్ మరియు మాలవ్య రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఆస్ట్రాలజీ ప్రకారం, వృశ్చిక రాశిని అంగారకుడు పాలిస్తాడు. శని యొక్క ఈ దశమ దృష్టి కారణంగా మూడు రాశులవారు ఆపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహరాశి 
శని యొక్క దశమ దృష్టి ఈ రాశి యెుక్క నాల్గో ఇంట్లో ఏర్పడబోతుంది. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఫిల్మ్ లైన్, ఆర్ట్, మ్యూజిక్, మీడియాతో సంబంధం ఉన్నవారు మంచి లాభాలను పొందుతారు. వృత్తి, వ్యాపార మరియు బిజినెస్ లో మీకు విజయం దక్కుతుంది. 


వృషభం
శని యొక్క దశమ దృష్టి వృషభరాశివారికి అనుకూలంగా ఉంటుంది. ఇతడు మీ యెుక్క కర్మ గృహంలో సంచరిస్తున్నాడు. శని తన దృష్టిని ఏడో ఇంటి పై ఉంచాడు. దీని కారణంగా మీరు మంచి లాభాలను పొందుతారు. రీసెంట్ గా శుక్రుడు మీ లగ్న గృహంలో సంచరించాడు. ఇతని యెుక్క ఏడవ దృష్టి మీ దాంపత్య జీవితాన్ని ప్రబావితం చేస్తుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరిస్తుంది. ఇదే శనిదేవుడు నవపంచమ రాజయోగాన్ని చేస్తున్నాడు. దీంతో మీరు బిజినెస్ లో పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీరు కెరీర్‌లో పురోగతి సాధిస్తారు. 


Also read: Budh Asta in Mesham 2023: ఏప్రిల్ 23న మేష రాశిలో అస్తమించబోతున్న బుధుడు.. ఈ 4 రాశులకు కష్టాలు మెుదలు!


కుంభ రాశి
ఈ రాశి వారికి శని దశమ దృష్టి శుభప్రదంగా ఉంటుంది. శనిదేవుడు మీ జాతకంలో శష, కేంద్ర త్రికోణ రాజయోగాన్ని చేస్తున్నాడు. మరోవైపు శుక్రుని సంచారం వల్ల మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. శని మరియు శుక్రుల దృష్టి మీ వృత్తి మరియు వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా మీరు కెరీర్ మరియు బిజినెస్ లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారులకు మంచి ధనం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Also Read: Chaturgrahi Yogam: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో నాలుగు గ్రహాల మహా కలయిక.. ఈ 5 రాశులకు తిరుగులేదు ఇక..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook