Shani Dev: జూలై 12న రాశిని మార్చబోతున్న శని... ఈ 3 రాశులవారికి ఇబ్బందులు తప్పవు!
Shani Dev Zodiac Change in July 2022: వచ్చే నెలలో శనిదేవుడు రాశి మారబోతున్నాడు. శని సంచారం కాలంలో 3 రాశుల వారు ఇబ్బందులు పడవచ్చు. అటువంటి పరిస్థితిలో శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
Shani Dev Zodiac Change in July 2022: శని దేవుడును న్యాయ దేవుడు అంటారు. మనం చేసిన కర్మలకు అదే ఫలితాన్ని ఇస్తాడు. ఇతర గ్రహాల మాదిరిగానే, శని దేవుడు (Shani Dev) కూడా ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. ప్రస్తుతం కుంభరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. వచ్చే నెలలో అంటే జూలై 12వ తేదీన అతను తిరోగమన స్థితిలో మకరరాశిలో (Saturn Transit in Capricron 2022) సంచరిస్తాడు. వచ్చే ఏడాది జనవరి వరకు ఆ రాశిలోనే ఉంటాడు. మకరరాశిలో శని సంచారం.. 3 రాశులవారిని ఇబ్బందులు కలిగించవచ్చు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
దీర్ఘకాలిక వ్యాధులు బయటపడవచ్చు
ధనుస్సు (Sagittarius): ఈ రాశి వారికి 20 రోజుల తర్వాత శనిదేవుని చెడు దృష్టికి గురికావలసి ఉంటుంది. వీరికి దీర్ఘకాలిక వ్యాధులు బయటపడే అవకాశం ఉంది. ఎవరికైనా డబ్బు ఇస్తే అది పోతుంది. అకస్మాత్తుగా కొత్త వ్యాధి మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. ఎంత కష్టపడితే అంత ఫలం లభిస్తుంది. కుటుంబంలో విభేదాలు పెరిగే అవకాశం ఉంది. శని దేవుడి చెడు దృష్టిని శాంతింపజేయడానికి మీరు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ప్రతి శనివారం పీపుల్ చెట్టును పూజించాలి. అలాగే ప్రతి శనివారం ఆవనూనెను అవసరమైన వారికి దానం చేయాలి.
వ్యాపారంలో నష్టం రావచ్చు
సింహం (Leo) : ఈ రాశి వారికి వచ్చే 6 నెలలు కూడా ఇబ్బందికరమే. వ్యాపారంలో నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. మీరు ఏదైనా కోర్టు వ్యవహారంలో చిక్కుకోవచ్చు. ఆఫీసులో మీ సహోద్యోగులు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు. కుటుంబంలో ఇబ్బంది వాతావరణం ఏర్పడవచ్చు. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు కుటుంబంలో కొన్ని ఆకస్మిక అనారోగ్యాన్ని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ప్రతి శనివారం ఆవుకి రోటీ తినిపించి ఇంట్లో శని మంత్రాలు జపించాలి.
పిల్లల చదువుల గురించి ఆందోళన
మేషం (Aries): ఈ రాశి వారికి 20 రోజుల తర్వాత పని చెడిపోతుంది. వారు సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయవలసి ఉంటుంది. కుటుంబంలో అశాంతి వాతావరణం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో నష్టాలుంటాయి. మీరు పిల్లల చదువుల గురించి ఆందోళన చెందుతారు. కుటుంబంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు వినవచ్చు. ఈ పరిస్థితుల్లో శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి మంగళ, శనివారాల్లో ఆలయానికి వెళ్లాల్సిందే. అక్కడ మీరు హనుమాన్ చాలీసా మరియు శని చాలీసాలను పఠించడం మరియు వాటిని హృదయపూర్వకంగా స్మరించుకోవడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడగలరు.
Also Read: Horoscope Today June 22 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి అకస్మిక ధన లాభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.