Horoscope Today June 22 2022: మేషం ( Aries): సంపాదనను పెంచుకోవడానికి మరిన్ని మార్గాలను కనుగొంటారు. నూతనంగా చేపట్టే పనుల్లో సహనం, పట్టుదల అవసరం. విహారయాత్ర కోసం మీ ప్రణాళికలు ఎటువంటి అవాంతరాలు లేకుండా కొనసాగుతాయి. విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.
వృషభం (Taurus): కష్టపడి సంపాదించిన డబ్బును వృధా అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో తోటివారి ప్రోత్సాహంతో అనుకున్నది సాధిస్తారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పట్టుదలతో ముందుకు సాగుతారు. గృహిణులు తమ సృజనాత్మక ద్వారా అందరినీ ఆకట్టుకునే అవకాశం ఉంది. స్నేహితులతో ప్రయాణాలు సరదాగా సాగుతాయి. మీ ఇష్ట దైవాన్ని పూజించండి.
మిథునం (Gemini): ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఉద్యోగస్తులకు అనుకూల కాలం. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మానసిక ఒత్తిళ్లను ఎదుర్కోవడంలో ధ్యానం మంచి పరిష్కారం. లక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం.
కర్కాటకం (Cancer): ఆర్థిక రంగంలో ఉన్నవారు లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధు, మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. గృహిణులు ఇంటి ముందు కొన్ని సానుకూల మార్పులు చేయడానికి చొరవ తీసుకుంటారు. విద్యారంగంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం చదవడం మంచిది.
సింహం (Leo): కస్టపడి అనుకున్నది సాధిస్తారు. మీ ఆలోచనలు ఇప్పుడు అవాస్తవంగా అనిపించినప్పటికీ పెద్దల మద్దతు అందుతుంది. కుటుంబంతో గడపడం ఈరోజు చాలా సంతృప్తికరంగా మరియు వినోదాత్మకంగా ఉంటుంది. నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
కన్య (Virgo): ద్రవ్య రంగంలోని వారికి ఎలాంటి సమస్య లేదు. మీ ఆలోచనలు ఇప్పుడు అవాస్తవంగా అనిపించినప్పటికీ.. సీనియర్లు మద్దతు ఇస్తారు. కీలక వ్యవహారంలో తోటివారి ఆలోచనల వల్ల మంచి జరుగుతుంది. అకారణ కలహసూచన ఉంది. వాదనలకు దూరంగా ఉండటమే మంచిది. లక్ష్మీదేవి సందర్శనం మంచిది.
తుల (Libra): అన్ని రంగాల వారికీ అనుకూలమైన సమయం. ఊహించని డబ్బు వచ్చే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు. అందరి ప్రశంసలను అందుకుంటారు. ఉద్యోగాలు మారాలనుకునే వారికి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురుకానున్నాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సుందరకాండ పారాయణ శుభప్రదం.
వృశ్చికం (Scorpio): విదేశీ ప్రయాణం వ్యాపారాన్ని విస్తరించడంలో సహాయపడుతుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. తోటివారి సూచనలు తీసుకోవడం మంచిది. విద్యా విజయం సాధ్యమే, కానీ ప్రయత్నాలు లేకుండా కాదు. ఈశ్వరారాధన శుభప్రదం.
ధనస్సు (Sagittarius): ఈరోజు మీరు చేపట్టిన ఏ పనిలోనైనా మీరు రాణించగలరు. దైవబలం అనుకూలిస్తోంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధు, మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి. విహారయాత్రకు ప్లాన్ చేసుకునే వారికి అనుకూల సమయం. ఇష్టదైవ ప్రార్థన శుభాలను చేకూరుస్తుంది.
మకరం (Capricorn): ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అన్ని రంగాల వారికి అనుకూలమైన సమయం. ప్రారంభించిన పనులను పూర్తి చేయగలుగుతారు. విదేశాలకు వెళ్లే సువర్ణావకాశం కొందరికి రావచ్చు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు.
కుంభం (Aquarius): ఆర్థిక లాభాలు ఉన్నాయి. ప్రారంభించిన పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా పూర్తిచేస్తారు. ఉద్యోగం మారే వారికి అనుకూల సమయం. సెలవుల్లో ఉన్నవారు కొన్ని కొత్త ప్రదేశాలను చూడవచ్చు. ఆకస్మిక ధనలాభం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.
మీనం (Pisces): మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. వృత్తిపరమైన ఓ అవకాశాన్ని కొందరు కోల్పోతారు. ఒక వ్యవహారంలో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. విష్ణు అష్టోత్తర శతనామావళి చదివితే మంచిది.
Also Read: Draupadi Murmu from BJP: ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీఏ అభ్యర్థి
Also Read: Powerful Zodiac Signs: అత్యంత శక్తివంతమైన రెండు రాశులేంటో తెలుసా, ఎలా ఉంటుంది ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.