శని గ్రహ గోచారం లేదా నక్షత్ర పరివర్తనం మరి కొద్దిగంటల్లో ఉంది. మార్చ్ 15 న శని గ్రహం నక్షత్ర పరివర్తనం చెంది అక్టోబర్ 17 వరకూ అంటే 7 నెలల వరకూ శతభిష నక్షత్రంలోనే ఉంటుంది. ఫలితంగా 5 రాశులపై ఊహించని ప్రభావముంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూ జ్యోతిష్యం ప్రకారం శని గ్రహాన్ని న్యాయదేవతగా పిలుస్తారు. ఇప్పుడీ గ్రహం మూల రాశి కుంభంలో ఉంది. 30 ఏళ్ల తరువాత శనిగ్రహం కుంభరాశిలో ఉండటం ఇదే. ఇప్పుడు మార్చ్ 15వ తేదీన నక్షత్రం మారనుంది. శనిగ్రహం గోచారంతో శతభిష నక్షత్రంలో మారనుంది. శతభిషంలో 7 నెలల వరకూ అంటే అక్టోబర్ 17 వరకూ ఉంటుంది. శతభిషం అధిపతి రాహువు. ఇందులో శనిగ్రహం ప్రవేశించడం వల్ల అందరి జీవితాలపై కీలక ప్రభావం పడుతుంది. ముఖ్యంగా 5 రాశులకు ఊహించని ధనలాభం కలుగుతుంది. 


మిధున రాశి


శని గ్రహం నక్షత్ర పరివర్తనం ప్రభావం మిధున రాశి జాతకులకు చాలా మంచిది. మీ కల నెరవేరవచ్చు. విదేశీ ప్రయాణముంటుంది. కెరీర్‌లో కీలక విజయం లభిస్తుంది. అయితే సవాళ్లు ఎదురైనా ఓటమి అంగీకరించవద్దు. ఆదాయం పెరగడం వల్ల ఆర్ధిక ఇబ్బందులు తలెత్తవు. 


తులా రాశి


రాహువు నక్షత్రం శతభిషంలో శని ప్రవేశించడం వల్ల తులా రాశి జాతకుల కెరీర్‌లో ఉన్నతి ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరవచ్చు. ఈ సమయంలో ఊహించని శుభ పరిణామాలు ఎదురౌతాయి. ధనలాభముంటుంది. కొత్త ఆదాయ మార్గాలుంటాయి. పెళ్లి యోగముంటుంది. జీవితంలో ఆనందం లభిస్తుంది. ఏ విధమైన సమస్యలు ఎదురుకావు.


సింహ రాశి


శని గ్రహం శతభిష నక్షత్రంలో ప్రవేశించడం వల్ల కెరీర్‌లో కీలకమైన విజయం లభిస్తుంది. దీర్ఘకాలంగా నిరీక్షించే ఫలితం దక్కుతుంది. ఉద్యోగ మార్పు ఉంటుంది. వ్యాపారం, సంపదలో కూడా లాభముంటుంది. ఆర్ధిక ఇబ్బందులు ఉండవు. ఆకస్మిక ధనలాభముంటుంది.


ధనస్సు రాశి


శని నక్షత్ర గోచారం ప్రభావం ధనస్సు రాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. పదోన్నతి, జీతం పెంపు ఉంటుంది. కోరిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారం చేసేవారికి ధనలాభం కలుగుతుంది. 


మేషరాశి


శని నక్షత్ర గోచారం మేషరాశి జాతకులకు అద్భుతమైన లాభాన్నిస్తుంది. వ్యాపారంలో కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్ధిక లాభాలుంటాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రతి పనిలో విజయం  ప్రాప్తిస్తుంది. అదృష్టం తోడుగా ఉండటంతో చేపట్టిన ప్రతి పని పూర్తవుతుంది. ఏ విధమైన ఆటంకాలు ఏర్పడవు.


Also read: Ugadi 2023: ఉగాది నుంచి ఈ రాశుల దశ తిరగబోతుంది...ఇక వీరికి డబ్బే డబ్బు.. ఇందులో మీది ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook