Shani Gochar 2023: మన యెుక్క కర్మల ఆధారంగా ఫలాలను ఇచ్చే దేవుడుగా శనిదేవుడిని భావిస్తారు. రీసెంట్ గా శనిదేవుడు శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించాడు. అక్టోబర్ 17 వరకు అతడు అదే రాశిలో సంచరించనున్నాడు. శనిదేవుడి గోచారం కారణంగా రాబోయే ఏడు నెలలపాటు ఆరు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనిదేవుడి సంచారం ఈ రాశులకు వరం
మిథునం: శని సంచారం వల్ల దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. రాబోయే ఏడు నెలలపాటు మీరు భారీగా ధనాన్ని పొందుతారు. 
మేషం : శనిదేవుడి గోచారం మేషరాశివారికి మేలు చేస్తుంది. మీరు అనుకున్న పనిని పూర్తిచేస్తారు. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. శని ప్రభావం వల్ల మేషరాశివారు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. 
సింహ రాశి : శతభిష నక్షత్రంలో శని గోచారం సింహ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాన్నిస్తుంది.  నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. మీకు జాబ్ వచ్చే  అవకాశం ఉంది. 


ధనస్సు : ధనుస్సు రాశి వారికి శని సంచారం మేలు చేస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే  అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీ కోరీకలు నెరవేరుతాయి. 
మకరం : శని గోచారం వల్ల మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మీరు ప్రతి పనిలోనూ విజయం  సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు కొత్త పనిని ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం.
తుల రాశి : శనిదేవుడి రాశి మార్పు తులరాశివారికి మంచి ప్రయోజనాలను ఇస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ తోపాటు ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. వ్యాపారం బాగుంటుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. 


Also Read: Budh Gochar 2023: నీచ రాజయోగాన్ని సృష్టించిన బుధుడు.. ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook