Shani Gochar 2023: మరో 3 రోజుల్లో ఈ రాశులను అదృష్టం వరించనుంది.. ఇందులో మీరున్నారా?
Shani Gochar 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలన్నింటిలోకెల్లా నెమ్మదికా కదిలే గ్రహం శని. మరో మూడు రోజుల్లో శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరించనుంది. దీని వల్ల కొందరి అదృష్టం ప్రకాశించనుంది.
Shani Gochar in Kumbh 2023: కలియుగ న్యాయమూర్తి అయిన శనిదేవుడు మరో మూడు రోజుల్లో కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శనిదేవుడు సాధారణంగా రెండున్నరేళ్లకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. 30 ఏళ్ల తర్వాత శని గ్రహం కుంభరాశికి చేరుకుంటుంది. జనవరి 17న శనిదేవుడి సంచారం జరగబోతుంది. కుంభరాశిలో శని సంచారం వల్ల 'శష మహాపురుష యోగం' ఏర్పడుతుంది. ఈ యోగం మూడు రాశులవారి అదృష్టాన్ని ప్రకాశింపజేయనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
శని సంచారం ఈ రాశులకు శుభప్రదం
వృషభం (Taurus)- వృషభ రాశి వారికి 'శష మహాపురుష యోగం' శుభప్రదంగా ఉంటుంది. ఈ యోగం వల్ల మీరు మీ కెరీర్‌లో గొప్ప పురోగతిని సాధిస్తారు. విదేశాల నుండి డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పూర్వీకుల ఆస్తి మీకు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితిలో మార్పు ఉంటుంది.
తుల రాశి (Libra)- తులారాశికి అధిపతి శుక్రుడు. శని, శుక్రుల స్నేహం వల్ల ఈ రాశివారి భారీగా లాభాలను పొందుతారు. ఈ సమయంలో మీ కెరీర్ లో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కనే వారు విజయం సాధిస్తారు. వ్యాపారులు తమ బిజినెస్ విస్తరిస్తారు. ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది.
ధనుస్సు (Sagittarius)- శని సంచారంతో ధనుస్సు రాశి వారిపై శని సడే సతి ముగుస్తుంది. మీ కెరీర్ లోని అడ్డంకులు మరియు బాధలు అన్నీ తొలగిపోతాయి. మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయ రంగంలో చురుగ్గా ఉన్నవారు మంచి పదవిని పొందే అవకాశం ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
Also Read: Mercury Rise 2023: ధనుస్సు రాశిలో ఉదయించిన బుధుడు.. ఈ రాశులవారు వ్యాపార, ఉద్యోగాల్లో దూసుకుపోతారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి