Benefits of Kendra Trikon Rajyog 2023: ఆస్ట్రాలజీలో నెమ్మదిగా కదిలే గ్రహాల్లో శని కూడా ఒకటి. ఇది ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడానికి రెండున్నరేళ్లు పడుతుంది. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. దీని వల్ల అరుదైన త్రికోణ రాజయోగం(Kendra Trikon Rajyog) ఏర్పడుతుంది. అదృష్ట యోగాలలో ఇది కూడా ఒకటి. త్రికోణ స్థానంలో లక్ష్మీదేవి, కేంద్ర స్థానంలో శ్రీమహావిష్ణువు కూర్చుని ఉంటారు. త్రికోణ రాజయోగం వల్ల ఏ రాశుల వారు బెనిఫిట్స్ పొందనున్నారో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

త్రికోణ రాజయోగం ఈ 3 రాశులకు వరం
కుంభ రాశి
త్రికోణ రాజయోగం కుంభ రాశి వారికి మేలు చేస్తుంది. మీ ఆత్మవిశ్వాసంతోపాటు మేథో సామర్థ్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ వ్యక్తిత్వంతో నలుగురినీ ఆకట్టుకుంటారు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారులు ప్రయోజనం పొందుతారు. మీరు ఊహించని ధనం లాభం పొందుతారు.
వృషభం
త్రికోణ రాజయోగం వృషభరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. దీని వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ కెరీర్ బాగుంటుంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 
సింహరాశి
ఈ యోగం వల్ల సింహరాశి వారు అనుకున్నది సాధిస్తారు. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న మీ పనులన్నీ పూర్తవుతాయి. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంపత్య జీవితం బాగుంటుంది. 


Also Read: Nag Panchami 2023: నాగపంచమి నాడు ఈ 4 రాశులకు పట్టనున్న అదృష్టం.. ఇందులో మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి