Mahabhagya Rajyog 2023 Benefits:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలనుగుణంగా  రాశులను మారుస్తాయి. న్యాయాధిపతి మరియు కర్మలను బట్టి ఫలాలను ఇచ్చేవాడు శనీశ్వరుడు. 30 ఏళ్ల తర్వాత శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. మరో 5 రోజుల్లో అంటే మార్చి 15న శని శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా మహాభాగ్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది జ్యోతిషశాస్త్రంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మహాభాగ్య రాజయోగం నాలుగురాశులవారికి అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని నక్షత్రం మార్పు ఈ రాశులకు అదృష్టం
వృషభం: మార్చి 15వ తేదీన శని నక్షత్రం మారిన వెంటనే మీకు మహాభాగ్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది వృషభరాశి వారికి చాలా మేలు చేస్తుంది. మీ  కెరీర్‌లో మంచి విజయాలు సాధిస్తారు. మీరు పదవి, డబ్బు దక్కుతాయి. వివాహం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బలపడతుంది.  
మిథునం: మహాభాగ్య రాజయోగం మిథున రాశి వారికి మీలో ధైర్యాన్ని పెరుగుతుంది. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందవచ్చు. దాంపత్య జీవితంలో ప్రేమ, ఆనందం పెరుగుతాయి. ఆకస్మిక ధనం లభిస్తుంది. వ్యాపారస్తులు లాభాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది.
కర్కాటక రాశి: మహాభాగ్య రాజయోగం కర్కాటక రాశి వారికి జీవితంలో మంచి రోజులు మొదలవుతాయి. మీరు విదేశీ పర్యటనకు వెళ్లవచ్చు. వ్యాపారస్తులకు విదేశాల నుంచి లాభం చేకూరుతుంది. ఈ సమయం విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. మీరు కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసుకోవచ్చు. 
ధనుస్సు: మహాభాగ్య రాజయోగం ధనుస్సు రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలను, పురోభివృద్ధిని కలిగిస్తుంది. మీరు వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద ఆర్డర్‌లను పొందుతారు. ఈ సమయంలో ఉద్యోగస్తులకు ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ లభిస్తుంది. మీరు మీ వ్యక్తిత్వంతో ఇతరులను ఆకర్షిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.


Also read: Saturn Transit 2023: శని గ్రహం శతభిష నక్షత్ర ప్రవేశం, ఈ 5 రాశులకు లాటరీ తగిలేసింది 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook