Saturn Transit 2023: శని గ్రహం శతభిష నక్షత్ర ప్రవేశం, ఈ 5 రాశులకు లాటరీ తగిలేసింది

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనిగ్రహం శతభిష నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. శని గ్రహం నక్షత్ర గోచారం ప్రభావంతో వివిధ రాశులపై అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఏకంగా 7 నెలల వరకూ శనిగ్రహం ఇదే నక్షత్రంలో ఉండనుండటంతో..ఈ రాశివారికి లాటరీ తగిలినట్టే ఉంటుంది. మార్చ్ 15న శతభిష నక్షత్రంలో శని గోచారముంటుంది. 

Saturn Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనిగ్రహం శతభిష నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. శని గ్రహం నక్షత్ర గోచారం ప్రభావంతో వివిధ రాశులపై అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఏకంగా 7 నెలల వరకూ శనిగ్రహం ఇదే నక్షత్రంలో ఉండనుండటంతో..ఈ రాశివారికి లాటరీ తగిలినట్టే ఉంటుంది. మార్చ్ 15న శతభిష నక్షత్రంలో శని గోచారముంటుంది. 
 

1 /5

ధనస్సు జ్యోతిష్యం ప్రకారం శతభిష నక్షత్రంలో శని గోచారం ప్రభావం ధనస్సు రాశివారికి  అత్యంత శుభసూచకం. దీర్ఘకాలంగా ఉద్యోగం వంటి పెండింగ్ సమస్యల్నించి విముక్తి పొందుతారు. పదోన్నతి ఉంటుంది. వ్యాపారంలో విజయం లభిస్తుంది. 

2 /5

తుల రాశి శని నక్షత్ర గోచారం ఈ రాశివారికి అత్యంత లాభదాయకం. ఈ రాశివారి జీవితంలో సంతోషం రానుంది. ఉద్యోగులకు ఈ సమయం చాలా అనువైనది. వ్యాపారులకు లాభాలుంటాయి. కుటుంబంతో కలిసి మంచి సమయం గడుపుతారు. 

3 /5

సింహ రాశి ఉద్యోగం కోసం అణ్వేషిస్తుంటే మార్చ్ 15 తరువాత  మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. శని గ్రహం నక్షత్ర గోచారంతో ఈ రాశి జాతకులకు శుభసూచకంగా ఉంటుంది. శని గ్రహం శతభిష నక్షత్రంలో ప్రవేశించడం వల్ల చాలాకాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి.

4 /5

మిధున రాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సమయం ఈ రాశివారికి అత్యంత అనుకూలమైంది. ఈ సమయంలో శని శతభిష నక్షత్రంలో ప్రవేశించడం లాభదాయకం కానుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు మంచి సమయం. లాభాలు ఆర్జిస్తారు. శని దోషం నుంచి విముక్తి కలుగుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ప్రతిరంగంలో విజయం లభిస్తుంది. 

5 /5

మేష రాశి జ్యోతిష్యం ప్రకారం శని గ్రహం శతభిష నక్షత్రంలో ప్రవేశించడం వల్ల ఈ రాశి జాతకుల జీవితంపై విశేష ప్రభావం పడుతుంది. మేషరాశి జాతకులకు పెట్టుబడులతో లాభాలు కలుగుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం. ఉద్యోగులకు పదోన్నతి లేదా ఇంక్రిమెంట్లు లభిస్తాయి.