Shani Dev Nakshtra Parivantan: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మారుస్తూ ఉంటాయి. కర్మ మరియు న్యాయ ప్రదాత అయిన శని దేవుడు రాశిని మార్చబోతున్నాడు. శనిదేవుడు మార్చి 15న శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ నక్షత్రంపై రాహువు యెుక్క ఆధిపత్యం ఉంటుంది. శనిదేవుడు, రాహువు మధ్య స్నేహ భావం ఉంది. అందుకే శనిదేవుని రాశి మార్పు ప్రభావం అన్ని రాశులపైనా కనిపిస్తుంది. ఇది 3 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునం (Gemini): శని దేవుడి రాశిలో మార్పు మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు వ్యాపారంలో భారీగా లాభాలను ఆర్జిస్తారు. అలాగే విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోరికలు నెరవేరుతాయి. మీకు లక్ కలిసి వచ్చి ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆధాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విదేశీ కంపెనీతో మీరు ఏదైనా డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. ఫ్యామిలీతో సంబంధాలు మెరుగుపడతాయి. 


సింహ రాశి (Leo): శని దేవుడి రాశి మార్పు మీకు అనుకూలంగా ఉంటుంది. వైవాహిక సంబంధాలు మెరుగుపడతాయి. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో మీరు విజయం సాధిస్తారు. మీ ప్రేమ జీవితం కూడా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. పెళ్లికాని వారికి వివాహం జరుగుతుంది. ఉద్యోగులకు ఈ సమయం బాగుంటుంది. ఈ సమయంలో మీరు మణిని ధరించడం వల్ల మీ అదృష్టం ప్రకాశిస్తుంది. 


మకర రాశిచక్రం (Capricorn): శని యొక్క రాశి మార్పు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ వ్యాధులన్నీ దూరమవుతాయి. మీ పురోగతికి దారులు తెరుచుకుంటాయి. కోర్టు కేసుల్లో మీరు విజయం సాధిస్తారు. చమురు, ఇనుము, పెట్రోలియం వ్యాపారం చేసే వారు లాభపడతారు.


Also Read: Surya Sankranti 2023: సూర్య సంక్రాంతి ఈ 4 రాశులకు అదృష్టాన్ని ఇస్తుంది.. ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.