Saturn Retrograde in June 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాతగా భావిస్తారు. మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇచ్చేవాడు శని. అందుకే శని గమనంలో చిన్న మార్పు కూడా మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. గ్రహాలన్నింటిలోకెల్లా నెమ్మదిగా కదిలేది శని. ఇతడు రెండున్నరేళ్లకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. జూన్ 17న ఇదే రాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. ఇదే స్థితిలో శనిదేవుడు 139 రోజులపాటు ఉంటాడు. ఈ శని యెుక్క వక్రీ కొన్ని రాశులవారికి శుభఫలితాలను ఇవ్వబోతుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనుస్సు రాశి
శని తిరోగమనం ధనస్సు రాశి వారికి ఆర్థికంగా లాభాలను ఇవ్వనుంది. ఎందుకంటే శనిదేవుడు మీ రాశి యెుక్క మూడో ఇంట్లో సంచరించబోతున్నాడు. దీంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిరుద్యోగులకు జాబ్ వస్తుంది. మీరు డబ్బును ఆదా చేస్తారు. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. 


Also Read: Shani Vakri 2023: కేంద్ర త్రికోణ రాజయోగంతో ఈ 3 రాశులకు ఊహించని ధనం.. మీరున్నారా?


మిధునరాశి
శని వక్రీ మిథునరాశి వారికి మేలు చేస్తుంది. ఎందుకంటే శని గ్రహం మీ రాశి జాతకంలో 9వ ఇంట్లో  సంచరించబోతున్నాడు. దీంతో మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. ఫ్యామిలీతో మంచి సమయం గడుపుతారు. 


తుల రాశి
ఈ రాశిని పాలింటే గ్రహం శని. తులరాశి యెుక్క ఐదో ఇంట్లో శనిదేవుడు తిరోగమనం చేయబోతున్నాడు. ఇది తులరాశి వారికి ఊహించని లాభాలను ఇస్తుంది. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. లవ్ సక్సెస్ అవుతుంది. స్థిరచరాస్తులు కలిసి వస్తాయి. మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. 


Also Read: Mars transit 2023: జూలై 01 వరకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook