Mangla Gauri Vrat 2022: జూలై 19న శ్రావణ మొదటి మంగళవారం.. మంగళ గౌరీ వ్రతం ఎలా చేయాలో తెలుసుకోండి...
Mangla Gauri Vrat 2022: శ్రావణ మంగళవారానికి ఉన్న ప్రత్యేకత ఏంటి.. ఆరోజు వివాహిత స్త్రీలు మంగళ గౌరీ వ్రతం ఎందుకు చేయాలి.. ఎలా చేయాలి.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Mangla Gauri Vrat 2022: హిందువులకు శ్రావణ మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసంలో హిందువులు పరమ శివుడిని పూజిస్తారు. శ్రావణ మాసంలో ప్రతీ రోజూ ప్రత్యేకమైనదే. శ్రావణ మాసంలో భాగంగా ప్రతీ మంగళవారం మంగళ గౌరిని పూజిస్తారు. మంగళ గౌరీ వ్రతాన్ని ఎలా ఆచరించాలి.. మంగళ గౌరీని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మంగళ గౌరీ వ్రతం ఎప్పుడు.. ప్రాముఖ్యత ఏమిటి..
శ్రావణ మాసంలో మంగళవారం మంగళ గౌరీకి అంకితం చేయబడింది.ఈ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో మంగళ గౌరీని పూజిస్తారు. ముఖ్యంగా వివాహిత స్త్రీలు తమ భర్తలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఉపవాస దీక్ష చేసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. పెళ్లి కాని అమ్మాయిలు మంగళ గౌరీ వ్రతం చేస్తే మంచి సంబంధం కుదురుతుందని నమ్ముతారు. ఈసారి శ్రావణ మాసం జూలై 14న ప్రారంభమైంది. ఆగస్టు 12 వరకు శ్రావణ మాసం ఉండనుంది. ఈ మాసంలో మొత్తం 4 మంగళవారాలు వస్తున్నాయి. ఈ నాలుగు మంగళవారాల్లో మంగళ గౌరీని పూజించవచ్చు.
మొదటి మంగళ గౌరీ వ్రతం - జూలై 19, 2022
రెండవ మంగళ గౌరీ వ్రతం - జూలై 26, 2022
మూడవ మంగళ గౌరీ వ్రతం - ఆగస్టు 2, 2022
నాలుగవ లేదా చివరి మంగళ గౌరీ వ్రతం - ఆగస్టు 9, 2022
మంగళ గౌరీ పూజా విధానం ఇలా :
శ్రావణ మంగళవారం సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి స్నానం చేయాలి. శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా మందిరంలో అమ్మవారి చిత్ర పటం ముందు ఎరుపు వస్త్రాన్ని ఉంచండి. 16 అలంకరణ సామాగ్రిని అందులో ఉంచండి. మంగళ గౌరీ కథను పఠిస్తూ మనసులో అమ్మవారిని తలుచుకోండి. మంగళ గౌరీ వ్రతం రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. ఆహారంలో ఉప్పు వాడవద్దు. శ్రావణ మంగళ గౌరీ అనుగ్రహంతో వివాహిత స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది. కాబట్టి వివాహిత స్త్రీలు మంగళ గౌరీ వ్రతాన్ని పాటించి తమ సౌభాగ్యాన్ని కాపాడుకుంటారు.
Also Read: Neet UG 2022: నేడు నీట్ పరీక్ష.. హాజరుకానున్న 18 లక్షల మంది విద్యార్థులు.. ఈ నిబంధనలు తప్పనిసరి..
Also Read: CM Kcr Aerial View: భద్రాది జిల్లాలో భారీ వర్షాలు.. సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే రద్దు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.