Scorpio and Aquarius zodiac signs Lovers have a good time on 17 December 2022: మేషం (Aries): శుభకాలం. నూతనంగా ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురైనా.. అధిగమించే ప్రయత్నం చేస్తారు. అన్ని పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాలు చేస్తారు. సంకటహర గణపతి స్తోత్రం చదవడం మంచిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): అన్ని పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. కష్టపడైనా నిర్ణీత సమయంలో లక్ష్యాలను చేరుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించిన ఓ కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆంజనేయ స్వామి సందర్శనం మంచిది.


మిథునం (Gemini): చేపట్టే పనుల్లో ఆందోళన అనవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారం ముందుకు జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంతో హాయిగా ఉంటారు. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.


కర్కాటకం (Cancer): ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్ధికస్థితి బాగుటుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. శివనామస్మరణ మంచిది.


సింహం (Leo): చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఫలితాలు రావడానికి ఎక్కువ శ్రమించాలి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. గణపతి స్తోత్రం చదవండి.


కన్య (Virgo): అన్ని రంగాల వారికీ అనుకూలం సమయం. మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబంతో శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదేవతా శ్లోకాలు చదవండి.


తుల (Libra): మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మిమల్ని వేధిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్త. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.


వృశ్చికం (Scorpio): శుభకాలం నడుస్తోంది. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. నూతన పనులను ప్రారంభించడానికి మంచి సమయం. ప్రేమికులు విజయాలు సాధిస్తారు. లక్ష్మీదేవి సందర్శనం మంచిది.


ధనస్సు (Sagittarius): అనుకూల సమయం. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. శత్రువులను మిరే గెలుస్తారు. వ్యాపారంలో ఆర్ధికంగా ఎదుగుతారు. ఈశ్వర శ్లోకాలు చదివితే మంచిది. 


మకరం (Capricorn): మిశ్రమకాలం నడుస్తోంది. శ్రమకు తగిన ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అన్ని పనులను త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం చదవడం మంచిది.


కుంభం (Aquarius): శుభకాలం. అన్ని పనులను కుటుంబసభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. ప్రయాణ సూచన ఉంది. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. ప్రేమికులకు మంచి సమయం ఇదే. సాయి నామాన్ని జపించాలి.


మీనం (Pisces): అధికారుల ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. విహార యాత్రకు వెళతారు. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదవండి.


Also Read: Sun Transit 2022: నేడే త్రిగ్రాహి యోగం.. ఈ 5 రాశుల వారు అదృష్టవంతులు! లెక్కలేనంత డబ్బు మీ సొంతం


Also Read: Astrology Tips For New Year 2023: కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈ చిన్న పని చేస్తే.. మీ ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుంది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.